భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన ఫోన్ కాల్.. ప్రశ్నార్థకంగా యువతి జీవితం

Published : Sep 10, 2018, 08:19 AM ISTUpdated : Sep 19, 2018, 09:17 AM IST
భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన ఫోన్ కాల్.. ప్రశ్నార్థకంగా యువతి జీవితం

సారాంశం

టెక్నాలజీ మనిషి జీవితంలో కల్లోలాన్ని రేపుతూనే ఉంది. ఎన్నో కాపురాల్లో చిచ్చు పెట్టి భార్యాభర్తలను విడదీస్తోంది. తాజాగా పెళ్లయిన ఐదు రోజులకే కొత్త జంటను విడదీసింది.

టెక్నాలజీ మనిషి జీవితంలో కల్లోలాన్ని రేపుతూనే ఉంది. ఎన్నో కాపురాల్లో చిచ్చు పెట్టి భార్యాభర్తలను విడదీస్తోంది. తాజాగా పెళ్లయిన ఐదు రోజులకే కొత్త జంటను విడదీసింది. వరంగల్ అర్బన్ జిల్లా కొండపర్తికి చెందిన ఓ యువతికి గతంలోనే వివాహమై కొన్ని కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది.

అయితే ఈమెకు ఐనవోలుకు చెందిన నరేశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు సదరు యువతికి రెండో పెళ్లి చేశారు.. వివాహం జరిగిన ఐదు రోజులకు నరేశ్ ఆమెకు ఫోన్ చేశాడు. యువతి ఏదో పనిలో ఉండటంతో భర్త కాల్ లిఫ్ట్ చేయగా.. నేను మీ ఆవిడను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త విషయాన్ని పెద్ద మనుషులకు వివరించి ఆమెను పుట్టింటికి పంపాడు. ఈ విషయాన్ని ఆమె నరేశ్‌కు చెప్పగా... తాను వివాహం చేసుకుంటానని చెప్పి తిరిగి మాట మార్చాడు.

దీంతో ఆమె నరేశ్ ఇంటి వద్ద దీక్షఖు దిగింది. దీనిపై నరేశ్ స్పందిస్తూ... మా ఇద్దరి మధ్య పరిచయం ఉన్న మాట నిజమే.. అయితే భార్యభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ...ఇప్పుడేమో తన ఇంటి వద్ద న్యూసెన్స్ చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా ప్రస్తుతానికి నరేశ్ ఒక్కడి నుంచే తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu