Road Accident: నెత్తురోడిన రోడ్డు.. ఎల్లారెడ్డిపేటలో పేయింటర్ దుర్మ‌ర‌ణం..  మ‌రో ప్ర‌మాదంలో..

Published : Jul 18, 2022, 08:03 PM IST
Road Accident: నెత్తురోడిన రోడ్డు.. ఎల్లారెడ్డిపేటలో పేయింటర్ దుర్మ‌ర‌ణం..  మ‌రో ప్ర‌మాదంలో..

సారాంశం

Road Accident: రాజ‌న్న‌సిరిసిల్లా జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి బస్టాండ్ సమీపంలో సోమవారం మద్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాయణ్ పేట్ గ్రామానికి చెందిన ఫేయింటర్ సాయిలు (40 ) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.

Road Accident: రాజ‌న్న‌సిరిసిల్లా జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం ప‌రిధిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. సోమ‌వారం రాగట్లపల్లి బస్టాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  రామాయణంపేట గ్రామానికి చెందిన పేయింటర్ సాయిలు (40 )  అక్కడికక్కడే మరణించాడు. ఎల్లారెడ్డిపేట ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో.. రామాయణం పేట గ్రామానికి చెందిన సాయిలు( 40) నివాసముంటున్నాడు. ఆయ‌న వృత్తి రీత్యా పేయింట‌ర్. సోమ‌వారం నాడు సాయిలు త‌న(టిఎస్ 23 బి 8394 నెంబర్) ద్విచక్ర వాహనంపై  ఎల్లారెడ్డిపేట నుంచి సిరిసిల్ల వైపు వెళుతున్నాడు.

ఈ క్ర‌మంలో రాగట్లపల్లి బస్టాండ్ స‌మీపంలోని మూలమలుపువద్ద  ప్ర‌మాద‌శాత్తువు రాళ్ళతెట్టెకు గుద్దుకొని కింద‌ప‌డిపోయాడు. త‌ల‌కు తీవ్రంగా గాయాలు కావ‌డంతో  అక్కడికక్కడే మరణించినట్లు తెలిపారు. అత‌ని మృతదేహన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై ఎస్ఐ శేఖర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతనికి భార్య నాగరాణి, కుమారుడు ,కుమార్తెలున్నారు. ఈ ప్ర‌మాదంతో రాగట్లపల్లి విషాద ఛాయాలు అలుముకున్నాయి.  

అలాగే.. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆరుగురు స్పాట్‌లోనే మృతి చెందారు.  Kama Reddy జిల్లాలోని Madnoor మండలం మెనూరు వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు  మృతి చెందారు. Auto ను Lorry  ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెప్పుతున్నారు.  

161 జాతీయ రహదారిపై  జ‌రిగిన ఈప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది.  ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో తొమ్మిది మంది ప్రయాణీకులున్న‌ట్టు స‌మాచారం. స్థానికుల సమాచారం మేర‌కు పోలీసులు..ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ  ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మహారాష్ట్రకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హైద్రాబాద్ నుండి లారీ గుజరాత్ వైపునకు వెళ్తుంది. మద్నూర్ నుండి బిచ్కుంద వైపు ఆటో వెళ్తోంది. అయితే ఆటో రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది.  మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?