లక్డికపూల్ లో రోడ్డు ప్రమాదం... భారీ ట్రాఫిక్ జాం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 15, 2021, 09:38 AM IST
లక్డికపూల్ లో రోడ్డు ప్రమాదం... భారీ ట్రాఫిక్ జాం (వీడియో)

సారాంశం

లారీ అదుపుతప్పి నడిరోడ్డుపై బోల్తా పడటంతో లక్డికాపూల్ లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

హైదరాబాద్: నిత్యం రద్దీగా వుండే హైదరాబాద్ లోని లక్డీకపూల్ రోడ్డులో ఓ భారీ కంటైనర్ లారీ బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టమేమీ జరగకున్నా రోడ్డుకు అడ్డంగా కంటైనర్ బోల్తాపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భారీ క్రేన్ సాయంతో రోడ్డుపై పడివున్న కంటైనర్ రోడ్డుపై నుండి పక్కకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

వీడియో

కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వేగంగా వెళుతుండగా మలుపు వద్ద లారీ అదుపుతప్పింది. దీంతో రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదం నుండి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. 
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం