పెద్దపల్లిలో ఘోరం... లారీ కింద నలిగి ఆర్ఎంపి దుర్మరణం

Published : Jun 01, 2023, 04:59 PM IST
పెద్దపల్లిలో ఘోరం... లారీ కింద నలిగి ఆర్ఎంపి దుర్మరణం

సారాంశం

పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపి డాక్టర్ దుర్మరణం చెందాడు. 

పెద్దపెల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజీవ్ రహదానిపై వేగంగా వెళుతున్న బైక్ ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వున్న ఇద్దరు రోడ్డుపై పడిపోగా వెనకనుండి వచ్చిన లారీ ఒకరిపైనుండి దూసుకెళ్లింది.  

పాలకుర్తి మండలం కొత్తపల్లికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ రామస్వామి మరోవ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వేగంగా వెళుతున్న బైక్ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వున్న ఆర్ఎంపితో పాటు మరో వ్యక్తి రోడ్డుపై పడిపోయారు. జాతీయ రహదారి కావడంతో నిత్యం రద్దీగా వుండే రోడ్డుపై వీరు పడిపోవడంతో వెనక నుండి వచ్చిన లారీ రామస్వామి తలపైనుండి వెళ్లింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతిచెందాడు. 

Read More  హెడ్ కానిస్టేబుల్ దౌర్జన్యం.. యువకుడిని చితకబాది... కారుతో ఢీకొట్టి, 100 మీటర్లు లాక్కెళ్లి..

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ముందుగా గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఆర్ఎంపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా బైక్ తో పాటు ఆటోను పక్కకు తీయించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం