సంతాన సాఫల్యం పేరుతో ఓ ఆర్ఎంపీ అరాచకం.. ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు..

By SumaBala Bukka  |  First Published Dec 11, 2021, 10:52 AM IST

ఈ క్లినిక్ లో Intra Vaginal injections ఇస్తున్నట్లు  గుర్తించామన్నారు. సంతాన సాఫల్యత కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్యుల ద్వారా మాత్రమే చికిత్స తీసుకుని మందులు వాడితే ఫలితం ఉంటుందన్నారు. గ్రామీణ మహిళలు తెలిసీ తెలియక ఇలాంటి వైద్యులను సంప్రదించి మోసపోవద్దని సూచించారు.  


కమలాపూర్ :  సంతానం లేని దంపతులు తమ వద్దకు చికిత్స తీసుకుని మందులు వాడితే త్వరగా సంతానం కలుగుతుందని మోసానికి పాల్పడుతున్న ముఠాగుట్టు రట్టయ్యింది. ఇలా మోసగిస్తున్న నకిలీ డాక్టర్ ప్రైవేట్, ఓ ప్రైవేట్ క్లినిక్ లో  జరిగే చీకటి దందాను వరంగల్ Task Force police, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం రట్టు చేశారు. 

మూడు రోజుల పాటు పోలీసులు ఈ ఆపరేషన్ చేసి చేధించారు.  జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ మదన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. సమ్మయ్య అనే RMP Doctor మహిళలకు వైద్య పరీక్షలు చేయడం, సంతానం కలిగిస్తామని చెబుతూ అర్హత లేకుండా వైద్యం చేస్తున్నారు. క్లీనిక్ లో Gynecologistsలు ఉన్నట్లు బోర్డులు పెట్టినా.. వారెవ్వరూ ఆస్పత్రికి రావడం లేదు.

Latest Videos

ఈ క్లినిక్ లో Intra Vaginal injections ఇస్తున్నట్లు  గుర్తించామన్నారు. సంతాన సాఫల్యత కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్యుల ద్వారా మాత్రమే చికిత్స తీసుకుని మందులు వాడితే ఫలితం ఉంటుందన్నారు. గ్రామీణ మహిళలు తెలిసీ తెలియక ఇలాంటి వైద్యులను సంప్రదించి మోసపోవద్దని సూచించారు.  

అనంతరం  ఆర్.ఎం.పి  సమ్మయ్య, ల్యాబ్ టెక్నీషియన్ గాదె ధనుంజయలను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి కమిషనరేట్లో సిపి తరుణ్ జోషి ముందు వారిని హాజరు పరిచారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ జీ, తహసిల్దార్ జాహెద్ భాష, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సంయుక్త, కమిషనరేట్ వైద్యాధికారి డాక్టర్ విజయ్ తదితరులు ఉన్నారు.

ఛీ..ఛీ.. ఆ ప్రదేశాన్నీ వదలలేదు.. మలద్వారంలో ఏడుకిలోల బంగారం స్మగ్లింగ్...

ఇదిలా ఉండగా, పిల్లలు కలగలేదని మధ్యప్రదేశ్ లో ఓ జంట అత్యంత దారుణానికి తెగబడిన ఘటన నవంబర్ లో జరిగింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. సంతానం కోసం అని  ఓ యువతిని బంధించిన ఓ వ్యక్తి ఆమెపై 16 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు అతని భార్య సహకరించడం గమనార్హం. చివరకు శిశువు జన్మించాక బాధితురాలిని ఈ నెల 6న బస్టాండ్ వద్ద పడేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

Ujjainలోని కథ్  బరోడా గ్రామానికి చెందిన  రాజ్ పాల్ సింగ్(38),  చంద్రకాంత 26 దంపతులు. గతంలో Rajpal Singh ఉప సర్పంచ్ గా పనిచేశాడు. అయితే, వారికి  ఇద్దరు పిల్లలు ఉండేవారు. వారిద్దరు ఏవో అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. తరువాత వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో children కోసం ఆ దంపతులు దారుణమైన ఆలోచన చేశారు. దీనికోసం 16 నెలల క్రితం మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఓ మహిళ వద్ద నుంచి  ఓ యువతి(21)ని కొనుగోలు చేశారు. young ladyని కొన్నప్పటి నుంచి victimని వారి ఇంట్లోనే బందీగా వుంచి రాజ్ పాల్ సింగ్ అనేక సార్లు rapeకి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. దీనికి రాజ్ పాల్ సింగ్ భార్య చంద్రకాంత కూడా సహకరించడం ఒళ్లు గగుర్పొడిచే విషయం. pregnant అయిన యువతి గత నెల 25న శిశువుకు జన్మనిచ్చింది. 

click me!