MLC Election 2021 : కేసీఆర్, బండి సంజయ్ ఓటు వేయలేదు.. ఎందుకంటే..

By SumaBala BukkaFirst Published Dec 11, 2021, 10:13 AM IST
Highlights

కేసీఆర్, బండి సంజయ్ తో సహా కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. నల్గొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కూడా ఓటు వేయలేదు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని పార్టీలు విస్తృత ప్రచారం జరిపిన సంగతి తెలిసిందే. అయితే పోచింగ్, క్రాస్ ఓటింగ్ భయంతో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌తో పాటు ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఓటు వేయలేదు.

ఈసారి,  MLC local authorities constituency ఎన్నికల్లో MPలు, MLAలు,  MLCల వంటి ఎక్స్-అఫీషియో సభ్యులకు భారత ఎన్నికల సంఘం (ECI) ఓటు హక్కును కల్పించింది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లోకేసీఆర్  ఓటు వేయాల్సి ఉంది.  అయితే ముఖ్యమంత్రి మెదక్ లోకల్ అథారిటీ నియోజక వర్గ ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. 

అలాగే ఆదిలాబాద్‌కు చెందిన బీజేపీ ఎంపీ Soyam Bapurao, Bandi Sanjay కూడా ఓటు వేయడానికి రాలేదు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 14న జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరు జాబితా సిద్ధం చేసే సమయంలో హుజూరాబాద్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఎన్నిక ఇంకా తేలకపోవడంతో ఆయనకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు రాలేదు. 

కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. నల్గొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కూడా ఓటు వేయలేదు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

కేసీఆర్‌ అందుకే ఓటు వేయలేదు...
గజ్వేల్‌ పోలింగ్‌ కేంద్రంలో కేసీఆర్‌ ‘కనిపించకపోవడం’పై టీఆర్‌ఎస్‌ నేతలు పెదవి మెదపలేదు. ఎన్నికల్లో గెలుపొందేందుకు తగినన్ని ఓట్లు ఉన్నాయి కాబట్టే ఆయన ఓటును వినియోగించుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బండి సంజయ్‌, సోయం బాపురావులు పార్లమెంట్‌ సమావేశాలకు హాజరవుతున్నారని, అంతేకాక కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో అభ్యర్థులను నిలబెట్టలేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు అన్నారు. శీతాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు ఉత్తమ్ కుమార్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు.

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. ఓటింగ్ శాతం ఎంతంటే.. ?

అంతకు ముందు రోజు దాదాపుగా టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్‌లను ఆయా జిల్లాల మంత్రులతో కలిసి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చారు.

ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ, కొన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్ ఓటర్లు మధ్యాహ్నం 12 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వారు మాక్ పోలింగ్‌లో పాల్గొన్నారు, ప్రత్యేకించి ప్రాధాన్యతా ఓటింగ్‌లో, మెజారిటీ మొదటిసారిగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు. తొలిసారిగా ఓటింగ్‌ హక్కు పొందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వంటి ఎక్స్‌ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కేసీఆర్, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సహా..  టీఆర్‌ఎస్ లోని పలువురు నేతలు ఓటింగ్ శాతాన్ని పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొన్ని జిల్లాల్లో పార్టీ అభ్యర్థులు లేనప్పటికీ కాంగ్రెస్, బీజేపీ ప్రతినిధులు ఓటు వేశారు.

click me!