మలద్వారంలో బంగారం పెట్టుకొని దొంగ రవాణా (స్మగ్లింగ్) చేస్తున్న నలుగురు సూడాన్ దేశస్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి ఏకంగా 7.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారు స్మగ్లింగ్ చేస్తున్న బంగారం విలువ రూ. 3.6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
శంషాబాద్ : Gold Smugglingను అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఎంత గట్టి నిఘా పెడుతున్నా.. స్మగ్లర్లు రోజుకో కొత్త దారి తొక్కుతున్నారు. స్మగ్లింగ్ లో క్రియేటివిటీ చూపిస్తున్నారు. కొన్నిసార్లు వారి పాచికలు పారుతున్నా.. మరికొన్ని సార్లు అడ్డంగా బుక్కవుతున్నారు. ఈ Smuggling ఐడియాలు ఎంతవరకు దారి తీస్తున్నాయంటే.. తేడా వస్తే ప్రాణాలకే ప్రమాదం జరిగేంతగా మారుతున్నా వీరు ఈ పనిని మానుకోకపోవడం విషాదం.
ఇదే క్రమంలో మలద్వారంలో బంగారం పెట్టుకొని దొంగ రవాణా (స్మగ్లింగ్) చేస్తున్న నలుగురు సూడాన్ దేశస్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి ఏకంగా 7.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి దుబాయ్ నుంచి Shamshabad కు వచ్చిన విమానంలోని ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల నడక తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అప్రమత్తమయ్యారు.
వారిని వైద్యాధికారుల దగ్గరికి తీసుకెళ్ళి పరీక్ష చేయించారు. వారు Rectumలో బంగారం పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించి, బయటకు తీయించారు. ఈ నలుగురు సుడాన్ దేశస్థులని, వారు స్మగ్లింగ్ చేస్తున్న బంగారం విలువ రూ. 3.6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని ఎవరు ఎక్కడినుంచి, ఎక్కడికి అక్రమ రవాణా చేస్తున్నారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి సంఘటనే సెప్టెంబర్ 29న ఇంఫాల్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడో ప్రయాణికుడు.. అతని దగ్గర దొరికిన బంగారంకంటే... స్మగ్లింగ్ కోసం దాన్ని దాచిపెట్టిన ప్రదేశం కస్టమ్స్ అధికారులను షాక్ కు గురి చేసింది.
సోమవారం Imphal Airportలో ఓ ప్రయాణికుడి దగ్గర 900 గ్రాముల బరువున్న.. సుమారు రూ. 42 లక్షల విలువ చేసే బంగారు పేస్ట్ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)స్వాధీనం చేసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 909.68 గ్రాముల బరువున్న నాలుగు మెటల్ పేస్ట్ ప్యాకెట్లను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఫేస్ మసాజర్ లో రూ. 20లక్షల విలువైన బంగారం స్మగ్లింగ్..
CISF సబ్-ఇన్స్‌పెక్టర్ బి దిల్లీ దీని గురించి చెబుతూ.. ఒక ప్రయాణికుడిని పరీక్షిస్తున్నప్పుడు అతని మల కుహరం లోపల మెటల్ ఉండటం గమనించారు.. దీంతో వెంటనే అతన్ని గట్టిగా ప్రశ్నించగా.. విషయం బయట పడింది. అతని మల కుహరంలో 909.7 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి నాలుగు ప్యాకెట్లలో దాచాడు.
అతని పేరు మహ్మద్ షెరీఫ్‌గా అని, ఈ ప్రయాణీకుడు కేరళలోని కోజికోడ్‌లో ఉంటాడని తేలింది. మంగళవారం మధ్యాహ్నం 2:40 గంటలకు ఎయిర్ ఇండియా విమానంలో ఇంఫాల్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అతడి మీద అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని ప్రశ్నించడం కోసం సెక్యూరిటీ హోల్డ్ ఏరియా నుంచి తీసుకెళ్లారు కానీ అక్కడ అతను వారు అడిగిన ప్రశ్నలకు "సంతృప్తికరంగా సమాధానం చెప్పలేకపోయారు" అని అధికారులు తెలిపారు.
దీంతో అతని నడుం కింది భాగాన్ని ఎక్స్-రే తీయడం కోసం అధికారులు అతడిని మెడికల్ టెస్ట్స్ రూం కి తీసుకెళ్లారు. ఆ ఎక్స్ రేలో తేలిన విషయం వారిని షాక్ కు గురి చేసింది.. ఎక్స్ రేలో అతని శరీరం లోపల లోహ వస్తువులు ఉన్నట్టు చూపించింది, దీంతో వారు మరింత గట్టిగా ప్రశ్నించడంతో ఆ ప్రయాణికుడు అసలు విషయం ఒప్పుకున్నాడని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.