సంగారెడ్డి జిల్లాలో ప్రతీకార హత్య.. చంపి, శవాన్ని దహనం చేసి.. తరువాత...

Published : Oct 13, 2023, 08:36 AM IST
సంగారెడ్డి జిల్లాలో ప్రతీకార హత్య.. చంపి, శవాన్ని దహనం చేసి.. తరువాత...

సారాంశం

సంగారెడ్డి జిల్లాలో ప్రతీకారహత్య కలకలం రేపింది. తల్లిని చంపిన వ్యక్తిని పదేళ్ల తరువాత తండ్రీకొడుకులు కలిసి హతమార్చారు. 

సంగారెడ్డి : తెలంగాణలోని సంగారెడ్డిజిల్లాలో ప్రతీకార హత్య కలకలం రేపింది. రాములు అనే వ్యక్తిని ఓ తండ్రీకొడుకులు చంపి, మృతదేహాన్ని దహనం చేశారు. సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ శివారులో ఘటన చోటు చేసుకుంది. ఆ తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. రాములు హత్య కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలయ్యాడు.  పదేళ్ల క్రితం లింగవ్వ అనే మహిళను రాములు హత్య చేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్లాడు.

అప్పటినుంచి రాములు మీద లింగవ్వ భర్త, కొడుకు గోపాల్ పగ పెంచుకున్నారు. తల్లిని చంపిన రాములను హతమార్చేందుకు తండ్రితో కలిసి కొడుకు గోపాల్ ప్లాన్ చేశాడు. తండ్రీకొడుకులు కలిసి జైలు నుంచి విడుదలైన రాములును కిడ్నాప్ చేశారు. ఆ తరువాత దుర్గాపూర్ మండలం ఖాజాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు.

ఖాజాపూర్ అటవీ ప్రాంతంలోనే రాములును హత్య చేసి, అక్కడే దహనం చేశారు. ఆ తరువాత  సిర్గాపూర్ పోలీస్ స్టేషన్లో తండ్రి కొడుకులు లొంగిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu