వారితో సమావేశానికి సమయం ఉంటుంది.. కానీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సమయం ఉండదా?: కేసీఆర్‌కు రేవంత్ లేఖ

Published : Jun 20, 2022, 04:35 PM IST
వారితో సమావేశానికి సమయం ఉంటుంది.. కానీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సమయం ఉండదా?: కేసీఆర్‌కు రేవంత్ లేఖ

సారాంశం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థుల పట్ల విద్యాశాఖ మంత్రి హేళనగా మాట్లాడుతున్నారని అన్నారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థుల పట్ల విద్యాశాఖ మంత్రి హేళనగా మాట్లాడుతున్నారని అన్నారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు భోజనం పెట్టమని హెచ్‌ఓ‌డీలు బెదిరింపులకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులతో సమావేశానికి సమయం ఉంటుంది కానీ.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సమయం ఉండదా అని ప్రశ్నించారు. 

‘‘గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన బాసర ఐఐఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్ధులు గత వారం రోజులుగా ఆందోళన చేస్తూ జైలు లాంటి జీవితం గడుపుతున్నారు. కనీసం వారి తల్లిదండ్రులను కూడా కలవనీయడం లేదు. సమస్యలను పరిష్కారించాలని విద్యార్ధులు కోరుతుంటే.. కరెంట్ నిలిపి వేసి, మంచి నీళ్లు బంద్ చేసి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇటువంటి చర్యలన్నీ ముమ్మాటికి మానవ హక్కలు ఉల్లంఘన కిందకే వస్తాయి’’ అని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

‘‘బాసర ఐఐఐటీ లో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి మీరు వెళ్లరు. మాలాంటి వారు వెళ్లి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకురావాలనుకుంటే హైదరాబాద్ నుంచి బాసర వరకు అణువణువునా పోలీసులను మోహరించి అరెస్టులకు పాల్పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎండకు ఎండుతూ వానకు తడస్తూ అంకుంటిత దీక్షతో తమ ఆందోళనను కొనసాగిస్తుంటే వాళ్ల సమస్యలు సిల్లీ అంటూ విద్యాశాఖ మంత్రి హేళనగా మాట్లాడుతున్నారు’ అని రేవంత్ మండిడ్డారు. 

మంత్రి కేటీఆర్.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని జూన్ 15న ట్వీట్ చేశారని.. ఇది చెప్పి కూడా 5 రోజులైందని అన్నారు. కానీ ఎటువంటి అతీగతీ లేదని చెప్పారు. ఇంత జరుగుతుంటే వేగంగా స్పదించాల్సిన కేసీఆర్ అసలు రాష్ట్రంలో ఉన్నారో లేదో తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు సమస్య గురించి కేసీఆర్ తెలుసో లేదో కూడా తెలియదని లేఖలో పేర్కొన్నారు. చివరగా దీర్ఘకాలిక సెలవులు ప్రకటించడమే పరిష్కారంగా భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే అంత కంటే సిగ్గుమాలిన చర్య మరొకటి ఉండదు అని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.


ఇదిలా ఉంటే.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏడు రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. 12 డిమాండ్ల పరిష్కారానికి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. సోమవారం వర్షం పడుతున్న లెక్కచేయకుండా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపడుతూనే ఉన్నారు. ఇక, విద్యార్థులకు మద్దతుగా వస్తున్న రాజకీయ పార్టీల, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు క్యాంపస్‌లోని అనుమతించడం లేదు. ఇప్పటికే బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులతో ప్రభుత్వం తరఫున పలుమార్లు సంప్రదింపులు జరిపిన ఫలితం లేకుండా పోయింది. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతామని స్పష్టం చేస్తున్నారు. 

గత అర్ధరాత్రి విద్యార్థులతో కలెక్టర్, ఆర్‌జీయూకేటీ డైరెక్టర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఆందోళన విరమించాలని కలెక్టర్ సూచించారు. అయితే విద్యార్థులు మాత్రం మంత్రులు కేటీఆర్, సబితలతో  రాత పూర్వక హామీ కావాలని పట్టుబట్టారు. దీంతో కలెక్టర్, అధికారులు అక్కడి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు యథావిధిగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇక,అంతకుముందు ప్రభుత్వంతో విద్యార్థుల చర్చలు సఫలమంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారిక ప్రకటన చేయగా.. చర్చలు విఫలమయ్యాయంటూ విద్యార్థులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?