తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: Government Employees తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పరస్పర బదిలీలకు KCR సర్కార్ సోమవరం నాడు అనుమతిని ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, Teachers పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 2558 మంది ఉద్యోగులకు ఉపాధ్యాయులు, ఉద్యోగుల Transfers ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి Sabitha Indra Reddy విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ల ఉద్యోగుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, ఒక జోన్ నుంచి మరో జోన్‌కు, ఒక మల్టీ జోన్ నుంచి మరో జోన్‌కు పరస్పర బదిలీలు కోరుకునే ఉద్యోగులు, అధికారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పరస్పర బదిలీ కోరుకునేవారికి ఎలాంటి సీనియారిటీ రక్షణ ఉండదంటూ మొదట్లో జారీ చేసిన జీవో 21లో ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
undefined
పరస్పర బదిలీలు కోరుకునేవారి సీనియారిటీని పరిరక్షించాలని సంఘాలు డిమాండ్ చేశాయి. ఆ మేరకు జిల్లా క్యాడర్ పోస్టుల పరస్పర బదిలీలకు సీనియారిటీ రక్షణ కల్పిస్తూ మళ్లీ 402 జీవోను ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోపై కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. సీనియారిటీ రక్షణతో ఇతర జిల్లాల నుంచి వచ్చే ఉద్యోగుల కారణంగా అప్పటికే ఆయా జిల్లాల్లో పని చేస్తున్న తమ సీనియారిటీలో తేడాలు వస్తాయని, కొత్తగా వచ్చేవారు తమకంటే సీనియర్లు అయ్యే అవకాశముందంటూ కోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు కోర్టు 402 జీవోను సస్పెండ్ చేసింది. దాంతో పరస్పర బదిలీలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది మార్చిలో కూడా పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 1 నుండి 15 వ తేదీ వరకు పరస్పర బదిలీలు కొరుకొనే వారు ధరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. ఒక ప్రాంతంలో ఉద్యోగం చేయడం ఇష్టం లేని వారు మరో ప్రాంతంలో ఉద్యోగం చేయడం కోసం పరస్పర అంగీకారం కుదుర్చుకొని బదిలీ కోసం ధరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాది మార్చి మాసంలో కొత్త జోనల్ వ్యవస్థ అమలు చేస్తున్న తరుణంలో ఉద్యోగుల బదిలీల కోసం పరస్ప బదిలీలకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఏ పోస్టులో ఉన్న వారు అదే పోస్టుకు పరస్పర బదిలీకి ధరఖాస్తు పెట్టుకోవాలని మార్చి మాసంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం జీవో 317 జారీ చేస్తూ వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులను కొత్త జిల్లాలలో సర్ధుబాటు చేసింది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయి లోకల్ కేడర్ విభజనపై ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ప్రభుత్వం మ్యూచువల్ ట్రాన్స్ ఫర్లకు అనుమతిని ఇచ్చింది. దీంతో పెద్దమొత్తంలో ఉద్యోగులు మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఎంచుకున్నారు.
క్యాడర్ల కేటాయింపు కోసం అనుసరించిన ఆప్షన్ల విధానంలో తప్పులు దొర్లాయి. తప్పులను సరిచేసి ఉద్యోగుల పరస్పర బదిలీలకు అనుమతించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. భార్యాభర్తల బదిలీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థించాయి. దీంతో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందించి పరస్పర ఉద్యోగుల బదిలీలకు అప్పట్లో అంగీకరించింది.