మోడీ తొత్తులుగా ఉంటారా, దీక్షకు వస్తారా: కేటీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

Published : Mar 07, 2021, 06:10 PM ISTUpdated : Mar 23, 2021, 03:00 PM IST
మోడీ తొత్తులుగా ఉంటారా, దీక్షకు వస్తారా: కేటీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

సారాంశం

టీఆర్ఎస్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్,బీజేపీలది ఆత్మ ఒక్కటే.. శరీరాలే వేరని రేవంత్ రెడ్డి విమర్శించారు.  


హైదరాబాద్: టీఆర్ఎస్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్,బీజేపీలది ఆత్మ ఒక్కటే.. శరీరాలే వేరని రేవంత్ రెడ్డి విమర్శించారు.

ఆదివారం నాడు తెలంగాణ మంత్రి కేటీఆర్ కి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఎన్నికల సమయంలో కుస్తీ, తర్వాత దోస్తీ అని టీఆర్ఎస్ , బీజేపీ బంధంపై రేవంత్ రెడ్డి విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో బీజేపీపై యుద్దమని కేసీఆర్ చేసిన ప్రకటనను రేవంత్ రెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తైన వెంటనే  ఢిల్లీకి వెళ్లి మోడీతో కేసీఆర్ రాజీ పడ్డారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మరోసారి బీజేపీపై యుద్దం అంటూ నాటకం మొదలు పెట్టారని ఆయన మండిపడ్డారు.

ఐటీఐఆర్, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు సిద్దమా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటి కాకపోతే  తన సవాల్ ను స్వీకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. తన సవాల్ ను స్వీకరించకుంటే మోడీ తొత్తులుగా, శాశ్వతంగా తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని  రేవంత్ రెడ్డి ఆ లేఖలో కేటీఆర్ ను హెచ్చరించారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?