మేం తిట్టడం మొదలు పెడితే తట్టుకోలేరు: బీజేపీపై కేటీఆర్ ఫైర్

By narsimha lodeFirst Published Mar 7, 2021, 5:43 PM IST
Highlights

జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని  తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. గల్లీ నుంచి హస్తిన వరకు సత్తాచాటిన జర్నలిస్టులకు రుణపడి ఉంటామని ఆయన చెప్పారు.

హైదరాబాద్: జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని  తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. గల్లీ నుంచి హస్తిన వరకు సత్తాచాటిన జర్నలిస్టులకు రుణపడి ఉంటామని ఆయన చెప్పారు.

మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రెస్ అకాడమీ ద్వారా  ప్రభుత్వం పరిహారాన్ని అందించింది. జర్నలిస్టులకు మంత్రి కేటీఆర్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జర్నలిస్టులు ప్రశ్నించాల్సిందే.. మేము వారికి చేయాల్సిందేనని ఆయన చెప్పారు.

మరణించిన 260మంది జర్నలిస్టు కుటుంబాలకు లక్ష చొప్పున సహాయం చేసినట్టుగా ఆయన తెలిపారు. మరణించిన జరల్నిస్టుల పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

బీజేపీ పాలిత గుజరాత్ లో కేవలం వెయ్యి అక్రిడేషన్ కార్డులు మాత్రమే ఉన్నాయన్నారు.. ఏదో చేసినట్లు ఆ పార్టీ ఎగిరెగిరి పడుతోందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాకముందు మాటలతోనే సీఎం కేసీఆర్ చీల్చి చెండాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కేసీఆర్‌ను బట్టేబాజ్ అనడానికి ఎన్నిగుండెలని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా మీద మేం కూడ మాట్లాడలేమా అని ప్రశ్నించారు. 
మేంమాట్లాడటం మొదలు పెడితే తట్టుకోలేరన్నారు.

బిడ్డ. నాకు, మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్ సహా మా నేతలకు కేసీఆర్ ట్రైనింగ్ ఉంది. మేము కూడా తిట్టగలమన్నారు.. తెలంగాణ రాకపోతే బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఆస్థిత్వమే లేదని ఆయన అభిప్రాయపడ్డారు.. బీజేపీ ఎంపీలు ఏరోజైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా అని ప్రశ్నించారు.

click me!