రేవంత్ రెడ్డి కరోనా లక్షణాలు.. మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్రకు దూరం..!

By Sumanth KanukulaFirst Published Aug 13, 2022, 12:35 PM IST
Highlights

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. కరోనా లక్షణాలతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఆయన కరోనా పరీక్షకు సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉంది.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. కరోనా లక్షణాలతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఆయన కరోనా పరీక్షకు సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉంది. వైద్య సిబ్బంది ఇప్పటికే శాంపిల్స్ సేకరించగా.. మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. కరోనా లక్షణాల నేపథ్యంలో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరంగా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. 

మరోవైపు మునుగోడులో కాంగ్రెస్ తలపెట్టిన పాదయాత్ర శనివారం ఉదయం నారాయణపురం నుంచి మొదలైంది. Azadi Gaurav Yatra కార్యక్రమంలో నేటి నుంచి వారం రోజుల పాటు మునుగోడు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే నేడు పాదయాత్ర ప్రారంభమైనప్పటికీ.. కాంగ్రెస్ ముఖ్యనేతలు దూరంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ.. ఆయన కరోనా లక్షణాలతో పాదయాత్రకు దూరం కానున్నారు.కాంగ్రెస్ చేపట్టిన ఈ పాదయాత్ర రాజీవ్ గాంధీ జయంతి రోజున(ఆగస్టు 20) చౌటుప్పల్‌లో ముగియనుంది. 

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఈ రోజు ఉదయం క్షమాపణ చెప్పారు. పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన, చండూరులో జరిగిన కాంగ్రెస్ సభలో వ్యాఖ్యలపై రేవంత్ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు రేంత్ రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ‘‘కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ పరుషమైన పదజాలం వాడటంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో నేను బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. ఇలాంటి చర్య, భాష ఎవరికీ మంచిది కాదు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అవమానించేలా ఇలా మాట్లాడటం తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేయడం జరుగుతుంది’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

click me!