పట్టువీడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి : రేవంత్ రెడ్డి క్షమాపణపై రియాక్షన్ ఇదే..

By Sumanth KanukulaFirst Published Aug 13, 2022, 10:56 AM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన, చండూరులో జరిగిన కాంగ్రెస్ సభలో వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. దీంతో ఈ వివాదం కాసింత చక్కబడుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావించారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తనను హోంగార్డుతో పోల్చడం అత్యంత బాధ కలిగించిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  తనను పార్టీ నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌పై చర్యలు తీసుకోని పీసీసీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను దూషించిన వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అద్దంకి దయాకర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు ఈ విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పాలన్నారు.

ఈ క్రమంలోనే దిగొచ్చిన రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బేషరుతగా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదం కాసింత చక్కబడుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావించారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. రేవంత్ క్షమాపణ చెప్పిన విషయం తన దృష్టికి రాలేదని అన్నారు. తాను చూడలేదని.. వినలేదని చెప్పారు. మునుగోడులో నేటి నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొనడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అద్దంకి దయాకర్‌ను ఉద్దేశిస్తూ.. తనపై వాడరాని పదం వాడిన వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.రేవంత్ క్షమాపణ చెబితే సంతోషమే కానీ.. అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని అన్నారు.

Also Read: దిగొచ్చిన రేవంత్ రెడ్డి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు

ఇక, పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన, చండూరులో జరిగిన కాంగ్రెస్ సభలో వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు రేంత్ రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ‘‘కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ పరుషమైన పదజాలం వాడటంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో నేను బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. ఇలాంటి చర్య, భాష ఎవరికీ మంచిది కాదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అవమానించేలా ఇలా మాట్లాడటం తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేయడం జరుగుతుంది’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  
 

click me!