మునుగోడులో ఓటుకు ఒకరు రూ. 30 వేలు.. మరొకరు రూ. 40 వేలు అంటున్నారు: బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై రేవంత్ రెడ్డి ఫైర్

By Sumanth KanukulaFirst Published Oct 9, 2022, 1:54 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశం అంతా తనదేనని అంటున్నారని టీపీసీసీ చీఫ్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, బీజేపీల దిగజారుడు రాజకీయాలు పరాకష్టకు చేరుకున్నాయని విమర్శించారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశం అంతా తనదేనని అంటున్నారని టీపీసీసీ చీఫ్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, బీజేపీల దిగజారుడు రాజకీయాలు పరాకష్టకు చేరుకున్నాయని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికపై ఏఐసీసీ కార్యదర్శుల సమీక్షలో పాల్గొన్న అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మునుగోడులో ప్రజాస్వామిక వాదులకు అపనమ్మకం కలిగే విధంగా టీఆర్ఎస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇది నిజంగా శోచనీయం అని అన్నారు. ఒకరు ఓటుకు రూ. 30 వేలు, మరొకరు ఓటుకు రూ. 40 వేలు అంటున్నారని ఆరోపించారు. 

టీఆర్ఎస్, బీజేపీ పాల్పడుతున్న నిబంధనల ఉల్లంఘనలపై ఎన్నిక సంఘంకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మునుగోడులో ప్రచార కార్యచరణ సిద్దం చేసుకున్నట్టుగా చెప్పారు. ఈ రోజు సాయంత్రం చౌటుప్పల్ మండలంలో తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం చేపట్టనున్నట్టుగా తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు మునుగోడులో అందరూ నాయకులు ఉండి.. బూతులవారీగా, గ్రామాల వారీగా సమీక్ష చేపట్టనున్నట్టుగా చెప్పారు. 

ఇక, ఈ రోజు సాయంత్రం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొయ్యలగూడం నుంచి తంగడ్ పల్లి వరకు కాంగ్రెస్ పార్టీ రోడ్ షో నిర్వహించనుంది. కొయ్యలగూడెం, దేవులమ్మనాగారం, పీపుల్ పహాడ్, ఎనగండ్ల తండ, అల్లపురం, జైకేసరం, నెలపట్ల, లింగొటం, కుంట్లగూడెం, చౌటుప్పల్ టౌన్ (చిన్నకొండుర్ రోడు) మీదుగా తంగడ్ పల్లి వరకు రోడ్ షో సాగనుంది. 

click me!