మునుగోడులో అమ్ముడుపోయిన వారిని తరమికొట్టాలి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Published : Sep 03, 2022, 02:36 PM IST
మునుగోడులో అమ్ముడుపోయిన వారిని తరమికొట్టాలి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

సారాంశం

టీఆర్ఎస్‌, బీజేపీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో అమ్ముడుపోయిన వారిని తరమికొట్టాలని పిలుపునిచ్చారు. మునుగోడులో కాంగ్రెస్ బలమేంటో పార్టీ శ్రేణులు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. 

టీఆర్ఎస్‌, బీజేపీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో అమ్ముడుపోయిన వారిని తరమికొట్టాలని పిలుపునిచ్చారు. మునుగోడులో కాంగ్రెస్ బలమేంటో పార్టీ శ్రేణులు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. మునుగోడులో తమను ఓడించే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదన్నారు. మునుగోడులో శనివారం కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బోసురాజు, మల్లు రవి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ మోసాలపై కాంగ్రెస్ చార్జిషీట్ విడుదల చేసింది. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడనేది బహిరంగ రహస్యమేనని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఎంతో చేసిందన్నారు. కాంగ్రెస్‌కు రాజగోపాల్ రెడ్డి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ధనిక రాష్ట్రాన్ని దోచుకుంటుందని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక తీర్పు తెలంగాణకు దిక్సూచి కావాలని అన్నారు. 
 
రజాకార్లపై పోరాటం చేసినప్పుడు బీజేపీ ఎక్కడుందని విమర్శించారు. సెప్టెంబర్ 17ను ఏడాది పాటు జరుపుకోవాలని అన్నారు. 8 ఏళ్లుగా కేసీఆర్ ఎవరికి లొంగిపోయారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలనేది కాంగ్రెస్ కోరిక అని చెప్పారు. 

అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా మునుగోడును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్‌కు వామపక్షాల మద్దతివ్వడం బాధకరమని అన్నారు. టీఆర్ఎస్‌కు వామపక్షాల మద్దతును తెలంగాణ సమాజం అంగీకరించదని అన్నారు.  బీజేపీ కార్పొరేటర్లకు దోచిపెడుతూ.. రైతులను రోడ్డున పడేస్తోందని మండిపడ్డారు. మునుగోడులో ఏం అభివృద్ది చేశాయని టీఆర్ఎస్, బీజేపీలు ఓట్లు అడుగుతున్నాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ 8 ఏళ్లుగా రాష్ట్రాని దోచుకుంటుందని.. బీజేపీ మతపరమైన రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. 

రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరితే ఏం లాభమని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్‌తో దోస్తీ చేసి రాష్ట్రంలో కాంట్రాక్టులు తెచ్చుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీలో చేరి వేల కోట్ల కాంట్రాక్టులు తెచ్చుకున్నారని మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !