తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదు.. పసుపు బోర్డుపై బీజేపీ మాట తప్పింది: రేవంత్ రెడ్డి ఫైర్

Published : Mar 12, 2023, 03:03 PM IST
తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదు.. పసుపు బోర్డుపై బీజేపీ మాట తప్పింది: రేవంత్ రెడ్డి ఫైర్

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వచ్చినా ప్రజల కష్టాలు తీరలేదని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానని  చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి తప్ప.. యువతకు ఉద్యోగాలు రాలేదని విమర్శించారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు. 

తెలంగాణ వచ్చినా ప్రజల కష్టాలు తీరలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ సొత్తును అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నేతలు జిల్లాకు పసుపు బోర్డు తెస్తామని మాట తప్పారని మండిపడ్డారు. పసుపు, జొన్న, చెరుకు పంటలకు గిట్టుబాటు ధరలు లేవని అన్నారు. 

ఇక, రేవంత్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి బీజేపీ, బీఆర్‌ఎస్‌లు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే ఆమె తండ్రి, సీఎం కేసీఆర్ వీధుల్లోకి వచ్చిన ఆందోళన చేస్తాడని.. పోటీగా  బీజేపీ రోడ్డుపైకి వస్తుందని అన్నారు. ఇదంతా ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అని ఆరోపించారు. లంచం ఇచ్చారని, తీసుకున్నారని అంటున్నారని.. అలాంటప్పుడు దర్యాప్తు అధికారులు కవితను తీసుకుపోయి లోపలేయడానికి గంట చాలు అని అన్నారు

లిక్కర్ స్కామ్‌లో ఏ విధంగా కథ నడిచింది, ఎవరూ నామినీలు, ఎవరూ బినామీలు అనేది స్పష్టంగా చెబుతున్నారని.. అలాంటప్పుడు అరెస్ట్ చేయడానికి ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. విచారణ పేరుతో కాలయాపన ఎందుకు ప్రశ్నించారు. కవితను ఈడీ అధికారులు ఏమైనా పేరంటానికి పిలుస్తున్నారా? అని మండిపడ్డారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే