ఆ ముగ్గురికి రావని చెప్పా, పనికి మాలినోళ్లను మంత్రులుగా పెట్టుకున్నాడు: కేసీఆర్ పై రేవంత్

By Nagaraju penumalaFirst Published 19, Feb 2019, 9:31 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినేట్ పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పనికి మాలినోళ్లను మంత్రులుగా పెట్టుకున్నాడంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు మంత్రి పదవులు ఇవ్వరని తాను ముందే చెప్పానని అదే జరిగిందన్నారు. 

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినేట్ పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పనికి మాలినోళ్లను మంత్రులుగా పెట్టుకున్నాడంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. 

టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు మంత్రి పదవులు ఇవ్వరని తాను ముందే చెప్పానని అదే జరిగిందన్నారు. 

రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో విమర్శలు చెయ్యకూడదని నిర్ణయించుకున్నానని అయితే తాను భయపడి విమర్శలు చెయ్యడం లేదంటూ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇకపై కేసీఆర్ చేసే తప్పులపై గొంతెత్తుతానని చెప్పుకొచ్చారు. తల తెగిపడినా సరే కేసీఆర్ ను వదిలిపెట్టేది లేదని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. 

Last Updated 19, Feb 2019, 9:32 PM IST