ఎంపీ కవితను ఇంట్లో నూతన మంత్రులు...మర్యాదపూర్వకంగా కలవడానికి

By Arun Kumar PFirst Published 19, Feb 2019, 9:27 PM IST
Highlights

తెలంగాణ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ లు నిజామాబాద్ ఎంపీ కవితను కలిశారు. మంత్రులుగా ఇవాళ ఉదయం రాజ్భవన్ లో ప్రమాణస్వీకారం చేసిన వారు సాయంత్రం హైదరాబాద్ లోని కవిత ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మంత్రులిద్దరిని అభినందించారు.
 
ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ...మహా నాయకుడు కేసీఆర్ కేబినెట్ లో తనకు చోటు లభించడం అదృష్టమన్నారు. తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు, అందుకు కృషి చేసిన ఎంపి కవిత కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
 
అలాగే సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ...  సంక్షేమ, అభివృద్ది పథకాలతో దేశమంతా తెలంగాణ వైపు చూసేలా చేసిన కేసిఆర్..పాలనలోనూ కొత్త ఒరవడిని సృష్టించారని ప్రశంసించారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేస్తాననని అన్నారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు.  మంత్రివర్గంలో అవకాశం కల్పించిన కేసీఆర్ కు,  ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Last Updated 19, Feb 2019, 9:27 PM IST