ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఎందుకోసమంటే..?

By Sumanth KanukulaFirst Published Feb 8, 2023, 10:20 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10వ తేదీన చెన్నైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కవిత బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని వివరించే అవకాశం ఉంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10వ తేదీన చెన్నైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కవిత బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని వివరించే అవకాశం ఉంది. వివరాలు.. ఓ సంస్థ ‘2024 ఎన్నికలు – ఎవరు విజయం సాధిస్తారు’ అనే అంశంపై చర్చను నిర్వహించనుంది. ఈ చర్చా వేదికలో ఎమ్మెల్సీ కవితతో పాటు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌.. తదితరులు పాల్గొననున్నారు. 

ఈ సందర్భంగా తెలంగాణలో అమలు  చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కవిత వివరించే అకావశం ఉంది. ఈ చర్చలో భాగంలో తెలంగాణ అమలవుతున్న రైతుబంధు, దళితబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యత గురించి కవిత ప్రసంగించనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఆమె ఎండగట్టనున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశాభివృద్ది కోసం బీఆర్ఎస్ ఆలోచలను ఆమె పంచుకునే అవకాశం ఉంది. 

click me!