అంబేద్కర్ పై అనుచిత పోస్టులు: హమారా ప్రసాద్ అరెస్ట్

Published : Feb 10, 2023, 04:11 PM ISTUpdated : Feb 10, 2023, 04:33 PM IST
అంబేద్కర్ పై  అనుచిత పోస్టులు: హమారా ప్రసాద్  అరెస్ట్

సారాంశం

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు  చేసిన హమారా ప్రసాద్  ను పోలీసులు అరెస్ట్  చేశారు. యూట్యూబ్ లో  అంబేద్కర్ పై  హమారా ప్రసాద్  అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు అందింది. 


హైదరాబాద్: అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు  చేసిన  హమారా ప్రసాద్ ను  పోలీసులు అరెస్ట్  చేశారు.  అంబేద్కర్ పై  అనుచిత వ్యాఖ్యలు  చేసిన ప్రసాద్  యూట్యూట్ లో   పోస్టు  చేశాడు.ఈ  విషయమై  నమోదైన ఫిర్యాదుల మేరకు  పోలీసులు హమారా ప్రసాద్  ను అరెస్ట్  చేసి రిమాండ్  కు తరలించారు. 

అంబేద్కర్  రాసిన పుస్తకాలపై  కూడా  హమారా ప్రసాద్  వివాదాస్పద వ్యాఖ్యలు  చేశారు. అంబేద్కర్ పై యూట్యూబ్  లో  వీడియోలను  విడతల వారీగా అప్ లోడ్  చేశారు.  అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలను దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు  తీవ్రంగా  ఖండించాయి.  ఈ రకమైన వీడియోలతో  సమాజంలో  ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని  మరికొందరు  అభిప్రాయపడ్డారు.  

హమారా ప్రసాద్  వీడియోను  బీఎస్పీ తెలంగాణ చీఫ్  ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్  బీఆర్ఎస్ పార్టీకి ట్యాగ్  చేశాడు. ప్రసాద్ పై  కేసు పెట్టాలని డిమాండ్  చేశారు. 
అంబేద్కర్ పై  యూట్యూబ్ లో  హమారా ప్రసాద్  వీడియోలను అప్ లోడ్  చేశారు.  ఈ వీడియోలపై  పోలీసులకు  ఫిర్యాదు అందింది. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  కూడా  ఈ  వీడియోలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.  హమారా ప్రసాద్ పై  చర్యలు తీసుకోవాలని  కొందరు  పోలీసులకు ఫిర్యాదు  చేశారుఈ ఫిర్యాదుల ఆధారంగా   పోలీసులు  ఇవాళ అల్వాల్ లో  హమారా ప్రసాద్  ను  పోలీసులు అరెస్ట్  చేశారు.  మేజిస్ట్రేట్  ఆదేశాల మేరకు  రిమాండ్  తరలించారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్