కేసీఆర్ బిర్రుతోనే జగన్ రెచ్చిపోతున్నారు: రేవంత్ ఫైర్

Published : Aug 20, 2020, 06:05 PM ISTUpdated : Aug 20, 2020, 06:14 PM IST
కేసీఆర్ బిర్రుతోనే జగన్ రెచ్చిపోతున్నారు: రేవంత్ ఫైర్

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే ఏపీ సీఎం జగన్ చెలరేగిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మిస్తోన్న ప్రాజెక్టుల్లో కేసీఆర్ కు కమీషన్లు వస్తున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. 


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే ఏపీ సీఎం జగన్ చెలరేగిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మిస్తోన్న ప్రాజెక్టుల్లో కేసీఆర్ కు కమీషన్లు వస్తున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. 

తెలంగాణకు కాపలాగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  అపెక్స్ కౌన్సిల్ అజెండాలో 69 జీవోను చేర్చాలని ఆయన కోరారు. లేకపోతే కోర్టుకు వెళ్తామని ఆయన ప్రకటించారు. 

. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేస్తే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు. విద్యుత్ సంస్థల నుండి అధికధరకు విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు  తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసిందని ఆయన ఆరోపించారు. 

also read:కొడుకుపై ఉన్న శ్రద్ద రైతులపై లేదు: కేసీఆర్ పై రేవంత్ ఫైర్

మెగా కృష్ణారెడ్డి కోసమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీ తర్వాత నిర్వహించాలని కేసీఆర్ కోరారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

రెండుు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలను పరిష్కరించేందుకు ఈ నెల 25వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అయితే కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు ఇవాళ కరోనా వచ్చింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | CM Revanth Reddy Speech on Telangana Education
Hyderabad Rains : గోల్కొండ బోనాన్ని తడిపిన వానచినుకులు.. ఈ సాయంత్రం నగరంలో జోరువానలే, ఈ ప్రాంతాల్లో అలర్ట్