రాజగోపాల్ రెడ్డి ఆరోపణలపై కేసీఆర్ వివరణ ఇవ్వాలి.. ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏమిటి?: రేవంత్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Aug 21, 2022, 1:40 PM IST
Highlights

మునుగోడులో కేసీఆర్ సభతో ఎలాంటి ఉపయోగం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో.. ఏం చేయబోతుందో కేసీఆర్ చెప్పలేదని విమర్శించారు. 

మునుగోడులో కేసీఆర్ సభతో ఎలాంటి ఉపయోగం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో.. ఏం చేయబోతుందో కేసీఆర్ చెప్పలేదని విమర్శించారు. ఆదివారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కోట్ల రూపాయలు కేసీఆర్‌కు సాయం చేసినట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారని.. ఆ ఆరోపణలపై కేసీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏమిటని ప్రశ్నించారు. 

ఎప్పటిలోగా డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తారో కేసీఆర్ చెప్పలేదని రేవంత్ రెడ్డి అన్నారు. 8 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పోడు  భూముల సమస్యను ఎలా తీరుస్తారో కేసీఆర్ చెప్పనేలేదని అన్నారు. చర్లగూడెం, కిష్టరాయపల్లి రిజర్వాయర్ల నిర్వాసితుల సమస్యను కేసీఆర్ ప్రస్తావించకోవడం బాధకరమని అన్నారు. మునుగోడు సెగ్మెంట్ రైతులకు ఇంకా సాగునీరు అందించడం లేదని ప్రశ్నించారు. 

పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ ఆద్యుడని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో లేని బీజేపీని ప్రత్యామ్నాయంగా సృష్టించింది కేసీరేనని అన్నారు. తెలంగాణపై బీజేపీ దాడికి కారణం కేసీఆర్ అని విమర్శించారు. టీఆర్ఎస్‌ను గెలిపిస్తే బీజేపీకి మద్దతిస్తారని అన్నారు.   

click me!