నిజామాబాద్‌లో షాకింగ్ ఘటన.. హోటల్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..

Published : Aug 21, 2022, 01:25 PM IST
నిజామాబాద్‌లో షాకింగ్ ఘటన.. హోటల్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..

సారాంశం

నిజామాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హోటల్‌ గదిలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. 

నిజామాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హోటల్‌ గదిలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వివరాలు.. నిజామాబాద్‌లోని కపిలహోటల్లో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను ఆదిలాబాద్‌కు చెందిన సూర్య ప్రకాష్, అతని భార్య అక్షయ, పిల్లలు ప్రత్యుష, అద్వైత్‌లుగా గుర్తించారు. సూర్య ప్రకాష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే గత రెండు వారాలుగా సూర్య ప్రకాష్ కుటుంబం హోటల్‌లోనే ఉంటున్నారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. వారి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై మృతుల బంధువులకు సమాచారం అందించారు.  ఇక, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?