కేటీఆర్‌ను విచారిస్తే వాస్తవాలు తేలుతాయి: సిట్ విచారణ తర్వాత రేవంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Mar 23, 2023, 2:37 PM IST

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ అంశంపై  మంత్రి కేటీఆర్  ను విచారించాలని సిట్  ను  కోరారు  రేవంత్ రెడ్డి,.  ఈ విషయమై  కేటీఆర్  వద్ద సమగ్ర సమాచారం ఉందన్నారు. 
 


హైదరాబాద్:  టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్  కు సంబంధించిన సమగ్ర సమాచారం  కేటీఆర్ వద్ద  ఉందని టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి చెప్పారు. టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ అంశంపై  సిట్  విచారణకు  గురువారంనాడు   టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి హాజరయ్యారు.  ఈ విచారణకు తర్వాత  టీపీసీసీ చీప్  రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ కు సంబంధించి  నిర్ధిష్ట ఆరోపణలు  చేసిన  తనకు , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మాత్రమే  నోటీసులు ఇచ్చారన్నారు.  కానీ  ఈ విషయమై  మాట్లాడిన మంత్రి కేటీఆర్ కు  సిట్ ఎందుకు  నోటీసులు ఇవ్వలేదో  చెప్పాలని ఆయన  సిట్  ను  రేవంత్ రెడ్డి  ప్రశ్నించారు. 

Latest Videos

పేపర్ లీక్  కేసుతో  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి  సంజయ్ కు, రాజశేఖర్ రెడ్డికి , ప్రవీణ్ కు ఈ కేసుతో  సంబంధం  ఉందని  కేటీఆర్  చేసిన ఆరోపణలను రేవంత్ రెడ్డి  ప్రస్తావించారు.  కేటీఆర్  కు నోటీసులు జారీ చేసి  ఈ విషయమై  విచారణ చేస్తే  వాస్తవాలు  వెలుగు చూస్తాయన్నారు.  ఈ విషయమై  కేటీఆర్  మాట్లాడిన  మీడియా  క్లిప్పింగ్ లను  సిట్  అధికారి  ఏఆర్ శ్రీనివాస్ కు  అందించినట్టుగా  రేవంత్ రెడ్డి  వివరించారు. 

 టీఎస్‌పీఎస్‌సీ లో  పాత కంప్యూటర్లను తీసివేసి  కొత్త కంప్యూటర్లను  కేటీఆర్  ఇచ్చారని  రేవంత్ రెడ్డి  గుర్తు  చేశారు.  ఈ మేరకు  టీఎస్‌పీఎస్‌సీ మాజీ చైర్మెన్ ఘంటా చక్రపాణితో  కేటీఆర్ ఫోటోను రేవంత్ రెడ్డి  మీడియా ప్రతినిధులకు  చూపారు. టీఎస్‌టీఎస్   కార్పోరేషన్ ద్వారా   కొత్త కంప్యూటర్లను  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అప్పగించారని రేవంత్ రెడ్డి  ప్రస్తావించారు. 

పేపర్ లీక్ కు సంబంధించి  నిర్ధిష్టమైన  ఆరోపణలు  చేసిన  విపక్షాలను  సిట్  ద్వారా  నోటీసులు ఇచ్చి  ప్రభుత్వం  ఇబ్బంది పెడుతుందని  రేవంత్  రెడ్డి విమర్శించారు. పేపర్ లీక్ కు సంబంధించి  తమ వద్ద  ఉన్న సమాచారం ప్రకారంగా  విమర్శలు చేస్తే  నోటీసులిచ్చి భయపెట్టే  ప్రయత్నం  చేస్తుందని  రేవంత్ రెడ్డి  ప్రభుత్వంపై మండిపడ్డారు.   నిరుద్యోగుల  సమస్యలను  దృష్టిలో  పెట్టుకుని సిట్  విచారణకు  హాజరైనట్టుగా  రేవంత్ రెడ్డి వివరించారు. 

 అరెస్ట్  చేసిన   నిందితులు  జైల్లోనే  ఉన్న సమయంలోనే   ఈ కేసుకు సంబంధించి  బీజేపీ కుట్ర ఉందని  మంత్రి కేటీఆర్ ఆరోపించారన్నారు.  సిట్  కూడా  నిందితులను   విచారించకుండానే పేపర్ ఎలా లీకైందో  కేటీఆర్  మీడియా సమావేశంలో  ఆరోపణలు  చేశారన్నారు.  ఈ విషయం తమ దృష్టికి రాలేదని  సిట్  అధికారి  ఏఆర్ శ్రీనివాస్ తనకు  చెప్పారన్నారు.  కేటీఆర్ ఆరోపణలకు  సంబంధించిన  సమాచారాన్ని తాను  సిట్  అధికారి  ఏఆర్ శ్రీనివాస్ కు  అందించినట్టుగా  రేవంత్ రెడ్డి  మీడియాకు వివరించారు. 

also read:సిట్ విచారణకు రేవంత్ రెడ్డి: కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన, ఉద్రిక్తత

సిట్  విచారణకు  హాజరయ్యేందకు  వస్తున్న సమయంలో  తనను  పోలీసులు  ఇబ్బందులకు గురి చేశారని  రేవంత్ రెడ్డి  చెప్పారు.  తెలంగాణ విద్యార్ధుల  భవిష్యత్తును  ఆంధ్రోళ్ల  చేతుల్లో  పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  పేపర్ లీక్ కు పాల్పడిన  ప్రవీణ్  రాజమండ్రికి  చెందిన వాడుగా  రేవంత్ రెడ్డి  చెప్పారు. ఈ  కేసును విచారిస్తున్న సిట్  అధికారి  ఏఆర్ శ్రీనివాస్ ది  విజయవాడ అని  రేవంత్ రెడ్డి  గుర్తు  చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా కూడా  ప్రజలకు  న్యాయం  జరిగిందా అని ఆయన  ప్రశ్నించారు.  

click me!