అదానీ సంస్థ అక్రమాలపై కేంద్రం ఎందుకు విచారణ చేయడం లేదు: రేవంత్ రెడ్డి

Published : Mar 15, 2023, 05:29 PM IST
 అదానీ సంస్థ అక్రమాలపై  కేంద్రం  ఎందుకు విచారణ  చేయడం లేదు: రేవంత్ రెడ్డి

సారాంశం

అదానీ సంస్థ అక్రమాలపై  కేంద్రం ఎందుకు  విచారణ  చేయడం లేదో  చెప్పాలని  రేవంత్ రెడ్డి  ప్రశ్నించారు.  

నిజామాబాద్: అదానీ సంస్థ అక్రమాలపై  కేంద్రం ఎందుకు  విచారణ చేయడం లేదో  చెప్పాలని  టీపీసీసీ  చీఫ్ రేవంత్ రెడ్డి  ప్రశ్నించారు. బుధవారంనాడు  ఆయన   నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడారు. అదానీ కంపెనీపై  హిండెన్ బర్గ్  ఇచ్చిన నివేదికపై  జేపీసీ  వేసి విచారణ  చేయాలని   కాంగ్రెస్ పార్టీ ఆందోళన  చేస్తుందన్నారు. అదానీపై హిండెన్ బర్గ్ నివేదికపై  పార్లమెంట్ లో చర్చ  రాకుండా  విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం  మోడీ సర్కార్  చేసిందని  రేవంత్ రెడ్డి విమర్శించారు.   

అదానీ  అంశంపై ఈడీ కి ఫిర్యాదు  చేసేందుకు  వెళ్లిన  ఎంపీలను  పోలీసులతో  మోడీ సర్కార్ అడ్డుకుందని  రేవంత్ రెడ్డి  చెప్పారు.  అక్రమాలు జరిగాయనే  ఆరోపణలు వచ్చిన  సంస్థపై  ఫిర్యాదు  చేసేందుకు వెళ్లిన ఎంపీలను ఎందుకు  అడ్డుకున్నారని రేవత్ రెడ్డి  ప్రశ్నించారు.   దీని వెనుక  ఉద్దేశ్యం  బయటపెట్టాలని  బీజేపీని  రేవంత్ రెడ్డి  డిమాండ్  చేశారు. 

యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో  అధికారంలో  ఉన్న బొగ్గు కుంభకోణం, 2జీ కుంభకోణం,  కామన్ వెల్త్  గేమ్స్  కుంభకోణాలపై  జేపీసీ ఏర్పాటు  చేసిన విషయాన్ని  రేవంత్ రెడ్డి  గుర్తు  చేశారు.

రైతులకు వ్యతిరేకంగా  కేంద్రం  తెచ్చిన  నల్ల చట్టాలపై  పోరాటం  చేసినట్టుగా   రేవంత్ రెడ్డి  గుర్తు  చేశారు. కేంద్ర ప్రభుత్వం  ప్రతిపక్షాల  గొంతు నొక్కే ప్రయత్నం  చేస్తుందని ఆయన  ఆరోపంచారు.  
 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?