వామన్ రావు దంపతుల హత్య: సీబీఐ విచారణకు రేవంత్ డిమాండ్

By narsimha lodeFirst Published Feb 18, 2021, 5:40 PM IST
Highlights


హైదరాబాద్: వామన్ రావు హత్యకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ లు కారణమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 

హైదరాబాద్: వామన్ రావు హత్యకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ లు కారణమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈ హత్యల్లో పుట్టా మధు, కుంట శ్రీనివాస్ లు పాత్రధారులుగా ఉన్నారన్నారు. వీళ్లను ప్రోత్సహించింది ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. వామన్ రావు దంపతులు ప్రభుత్వ అక్రమాలపై కేసులు వేసి పోరాటం చేస్తున్నారని ఆయన చెప్పారు.

also read:వామన్‌రావు దంపతుల హత్య: ముగ్గురి అరెస్ట్

ఈ హత్యలను దేశమంతా గమనిస్తోందన్నారు. టీఆర్ఎస్ నేతల అవినీతి, దోపీడీ, అక్రమాలపై వామన్ రావు పలు కోర్టుల్లో కేసులు వేసి పోరాటం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.హత్య జరగడానికి కొద్ది గంటల ముందే  రామగుండం సీపీతో వామన్ రావు ఫోన్ లో మాట్లాడి తనకు రక్షణ కల్పించాలని కోరిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

వామన్ రావు  వాదిస్తున్న కేసులన్నీ సీబీఐతో విచారణ చేయించాలని ఆయన కోరారు. వామన్ రావు దంపతుల హత్య కేసును సుమోటోగా తీసుకొని సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వాళ్లను చంపుతామని ప్రభుత్వంలోని పెద్దలే మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. 

ప్రశ్నించే గొంతులను చంపాలని టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీకి చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.

click me!