
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మండలం కాల్వచర్లలో అడ్వకేట్ వామన్ రావు దంపతులను హత్య కేసులో ముగ్గురిని పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు.ఈ నెల 17వ తేదీన కాల్వచర్లలో వామన్ రావు దంపతులను దుండగులు దారుణంగా హత్య చేశారు.ఈ హత్య జరిగిన తర్వాత పోలీసుల తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తాయి.
హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడ వామన్ రావుకు రక్షణ కల్పించలేదని పోలీసులను కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు విమర్శించారు.వామన్ రావు దంపతులను హత్య చేసిన తర్వాత నిందితులను మహారాష్ట్ర సరిహద్దుల్లో అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.
also read:వామన్‌రావు దంపతుల హత్య: ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు
వామన్ రావు దంపతుల కదలికలను అక్కపాక కుమార్ రెక్కీ నిర్వహించాడు.ఈ సమాచారాన్ని శ్రీనివాస్ కు అందించినట్టుగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ తో పాటు కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయవాద దంపతులను చంపిన నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు 10 బృందాలను సీపీ ఏర్పాటు చేశారు.నిందితులను పోలీసులు ఇవాళ రాత్రి మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుల్లో విధులను న్యాయవాదులు ఇవాళ బహిష్కరించారు.