రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు యాక్సిడెంట్.. భారీ ప్రమాదంతో ఆరు కార్లు ధ్వంసం (వీడియో)

Published : Mar 04, 2023, 12:36 PM ISTUpdated : Mar 04, 2023, 12:51 PM IST
రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు యాక్సిడెంట్.. భారీ ప్రమాదంతో ఆరు కార్లు ధ్వంసం (వీడియో)

సారాంశం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లుతున్న కాన్వాయ్‌కు భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ యాక్సిడెంట్‌లో కాన్వాయ్‌లోని ఆరు కార్లు ధ్వంసం అయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కూడా ప్రమాదానికి గురైంది. అయితే, ఆ కారులో బెలూన్లు సకాలంలో ఓపెన్ కావడంతో అతను సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదంలో పలువురు రిపోర్టర్లు గాయపడినట్టు తెలిసింది.  

న్యూఢిల్లీ: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లుతున్న కాన్వాయ్ భారీ ప్రమాదానికి గురైంది. ఆ కాన్వాయ్‌లోని కార్లు అతి వేగంగా వెళ్లుతుండగా ప్రమాద వశాత్తు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టుకున్నాయి. కాన్వాయ్ కారులే ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లోని ఆరు కార్లు ధ్వంసం అయ్యాయి. ఇందులో రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కూడా ఉన్నది. అయితే, ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవ్వగానే లోపల బెలూన్లు ఓపెన్ అయ్యాయి. దీంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది. ఇతర కార్లలో ప్రయాణిస్తున్న పలువురు రిపోర్టర్లకు గాయాలైనట్టు సమాచారం అందింది. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ధ్వంసమైన కార్ల వరుసకు సంబంధించిన వీడియో  ఇలా ఉన్నది.

 

Also Read: తనకంటే 11 యేళ్ల చిన్న వాడైన విద్యార్థితో మహిళా టీచర్ పరార్... హైదరాబాద్‌ లో ఘటన

శ్రీపాద ప్రాజెక్టుకు సందర్శన సందర్భంలో రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ స్టేజీ వద్ద ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. ఈ యాక్సిడెంట్‌లో గాయపడిన రిపోర్టర్లను వెంటనే సమీప హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం. ఎవరికీ తీవ్ర ప్రమాదం జరగకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

కార్లు ఢీకొనగానే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడ్డారు.కొందరు మీడియా ప్రతినిధులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురయిన కార్లలో నాలుగు కాంగ్రెస్ నాయకులవి కాగా మరో రెండు రిపోర్టర్లవి. ప్రమాదం జరిగిన వెంటనే రేవంత్ కారుదిగి కార్లను పరిశీలించారు. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించే ఏర్పాట్లు చేసారు. 

Also Read: రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం... సిరిసిల్లలో ఘోర ప్రమాదం.. స్పాట్ వీడియో

శ్రీపాద 9వ ప్యాకేజీ కెనాల్‌ను రేవంత్ రెడ్డి సందర్శించారు. అక్కడ ఇంకా నిర్మాణం పూర్తికాకుండా అసంపూర్తిగా ఉన్న కాలువను పరిశీలించారు. కాలువ పనులు పూర్తి కాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. అధికారులకు ఫోన్ చేసి ప్రశ్నలు వేశారు. ఇలా పనులు ఆలస్యం చేస్తే అంచనా వ్యయం పెరుగుతుందని అన్నారు. కేటీఆర్ తన అస్మదీయులకు పనుల కాంట్రాక్ట్ ఇచ్చారని, వారు లాభాలు దండుకుని మిగిలిన పనులు గాలికి వదిలేశారని ఆరోపణలు చేశారు. అంతేకాదు, అంచనా వ్యయం పెరగడానికి కారణం అవుతున్న ఆ నిర్మాణ సంస్థ గుర్తింపును రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ