ఆ ఎమ్మెల్యేను గాడిదతో పోల్చిన రేవంత్

Published : Jul 23, 2017, 04:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
ఆ ఎమ్మెల్యేను గాడిదతో పోల్చిన రేవంత్

సారాంశం

అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యేపై రేవంత్ ఫైర్ ఆడబిడ్డల చేత చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరిక పేదల భూములు లాక్కుంటే సహించబోమన్న రేవంత్ తక్షణమే సిఎం స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్

తెలంగాణ ఫైర్ బ్రాండ్, టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి తన పంచ్ డైలాగ్ లు పేల్చారు. అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. ఆ ఎమ్మెల్యే గాడిదతో సమానం అంటూ గట్టిగా విమర్శించారు. ఇంతకూ ఏ ఎమ్మెల్యేను గాడిదతో పోల్చారంటే...

మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ మండలంలో పర్వాతపురంలో రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే గాడిదతో సమానం అని విమర్శించారు. ఈ ఎమ్మెల్యే  అడబిడ్డల చేత చెప్పు దెబ్బల తినే రోజులు వచ్చాయని హెచ్చరించారు. పర్వతాపురం మహిళలు తమ మెడల తాళిబొట్టు తాకట్టు పెట్టి 60 గజాలు సంపాదించుకుంటే దాన్ని ఎమ్మెల్యే అక్రమంగా లాక్కుంటే ఉరుకోవాలా అని ప్రశ్నించారు.

36 ఎకరాల్లో 26 ఎకరాలు బడా పారిశ్రామిక వేత్తలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అనుచరులు భూములను అక్రమిస్తే ప్రభుత్వం అటు కన్నెత్తి చూడకుండా కేవలం పేదలకు కేటాయించిన 10 ఎకరాలను ఎమ్మెల్యే ఎందుకు లాక్కుంటున్నారని నిలదీశారు. ఘట్కేసర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వల్ల పర్వతాపురం మహిళలు రోడ్ల మీదకు రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సిఎం కేసీఆర్ వెంటనే అధికారులను, మంత్రులను పర్వతాపురం కి పంపి పట్టాలు ఉన్న పేదలకు భూమిని పంచాలని డిమాండ్ చేశారు. మహిళల కోసం ఇందిరా పార్కు దగ్గర ధర్నాచౌక్ తొలించారని చెబుతున్నారు మరి అదే మహిళలుపర్వతాపురంలో డంపింగ్ యార్డ్ వద్దు అంటున్నారు. తొలగించండి అని డిమాండ్ చేశారు రేవంత్.

 

PREV
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu