ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే రేవంత్ రెడ్డిని తరిమేస్తాం.. పేపర్‌లీకేజీలో ఆయన పాత్ర: గెల్లు శ్రీనివాస్ ఆరోపణలు

Published : Mar 21, 2023, 06:27 PM IST
ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే రేవంత్ రెడ్డిని తరిమేస్తాం.. పేపర్‌లీకేజీలో ఆయన పాత్ర: గెల్లు శ్రీనివాస్ ఆరోపణలు

సారాంశం

ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తరిమేస్తామని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించాడు. రేవంత్ రెడ్డి నిరుద్యోగుల వ్యతిరేకి అని అన్నాడు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నదని ఆరోపించాడు.  

హైదరాబాద్: బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నదని ఆరోపించాడు. నిరుద్యోగుల వ్యతిరేకి అని, ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే అడ్డుకుని తీరుతామని, తరిమేస్తామని హెచ్చరించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణలో విద్యార్థి సంఘాలతో మీడియా సమావేశం నిర్వహించాడు.

పేపర్ లీకేజీపై ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం దుర్మార్గమని గెల్లు శ్రీనివాస్ అన్నాడు. ఈ లీకేజీలో రేవంత్ పాత్ర ఉన్నదని, అందుకే సిట్ విచారణ జరగకుండా నిందితుడు రాజశేఖర్ రెడ్డి భార్యతో కోర్టులో కేసు వేయించాడని ఆరోపించాడు.

బీజేపీ, కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి లేదని, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలపై ఎందుకు మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేయరు? అని నిలదీశాడు. గుజరాత్‌లో పంచాయత్ శాఖ పోస్టుల పరిధిలో పేపర్ లీక్ అయిందని, యూపీలోనూ పేపర్ లీక్ అయిందని తెలిపాడు.  రాజస్తాన్‌లో టీచర్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో ఎందుకు సీఎం రాజీనామా చేయలేదని అడిగాడు.

Also Read: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి మామను చంపిన కోడలు

కేంద్రం ఎందుకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వట్లేదని, దీన్ని కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించడం లేదని గెల్లు శ్రీనివాస్ అడిగాడు. ఈ రెండు పార్టీలు ఒకరికొకరు తొత్తులుగా మారారని ఆరోపించాడు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు లోపాయికారిగా ములాఖత్ అయినవని అన్నాడు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే పీసీసీ అధ్యక్ష పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు.

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీకి ఏజెంట్‌గా పని చేస్తున్నాడని ఆరోపించాడు. ఈ కార్యక్రమంలో మందల భాస్కర్, వీరబాబు, తొట్ల స్వామి, తుంగ బాలు, కడారి స్వామి, కిరణ్ గౌడ్, రఘురాం సహా పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్