కేసిఆర్ పై మరో బాంబు పేల్చిన రేవంత్ (వీడియో)

Published : Jan 27, 2018, 06:05 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
కేసిఆర్ పై మరో బాంబు పేల్చిన రేవంత్ (వీడియో)

సారాంశం

కేసిఆర్ బంధువుపై కేసులు విత్ డ్రా చేస్తరా? రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తిపై ఎలా విత్ డ్రా చేస్తారు? ప్రశ్నిస్తే మంద కృష్ణను అరెస్టు చేస్తారా? పార్టీలో చేరనందుకే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య పార్టీలో చేరనందుకే గజ్వెల్ ప్రతాప్ రెడ్డిని వేధిస్తున్నారు

చట్ట సవరణ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి కేసిఆర్ ను తుగ్లక్ తో పోలుస్తూ విమర్శించారు. అయితే అంతకంటే ముందే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కొత్త వివాదాన్ని లేవనెత్తారు. అయితే రేవంత్ మాత్రం ఈరోజు ఏమాత్రం నోటి మాట జారలేదు. సిఎం చంద్రశేఖరరావు గారు అంటూ సంబోధించడం గమనార్హం. అయితే రేవంత్ ఇకపై తిట్లు పక్కన పెట్టి కేవలం సబ్జెక్ట్ వారీగా విమర్శలు చేసేందుకు ప్రయత్నించారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు.

కేసిఆర్ బంధువైన శేషగిరి రావు గతంలో నిమ్స్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన అవినీతికి పాల్పడి ఎసిబి కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని రేవంత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు కేసిఆర్ బంధువు కావడంతో శేషగిరిరావు పై ఎసిబిలో నమోదైన కేసులను విత్ డ్రా చేసిందని సంచలన ఆరోపన గుప్పించారు రేవంత్. బంధువైనందుకే ఎసిబి కేసులను ఉపసంహరించారా అని ప్రశ్నించారు.

మరోవైపు నల్లగొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త శ్రీనివాస్ బొడ్డుపల్లి హత్య కేసులో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాత్ర ఉందని రేవంత్ ఆరోపించారు. పార్టీ మారనందుకే హత్య చేశారన్నారు. గజ్వెల్ టిడిపి నేత ఒంటేరు ప్రతాస్ రెడ్డి పార్టీ మారకపోవడంతో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని ఆరోపించారు. రేవంత్ ఇంకేమన్నారో కింది వీడియోలో చూడండి.

PREV
click me!

Recommended Stories

Ameerpet Fire: అమీర్‌పేటలో అగ్ని ప్రమాదంఅసలు కారణాలు ఇవే వెల్లడించిన అధికారులు| Asianet News Telugu
పాతబస్తీలో కేటీఆర్ సందడి..Osmania Biscuits in Old City Hyd | KTR Charminar Visit | Asianet Telugu