కేసిఆర్ తెలంగాణ డేరా బాబా

Published : Aug 28, 2017, 04:07 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
కేసిఆర్ తెలంగాణ డేరా బాబా

సారాంశం

ఎపిలో అరాచకుడు జగన్ డేరా బాబా తెలంగాణలో కేసిఆరే డేరా బాబా 2019 తర్వాత డేరా బాబాకు పట్టిన గతే దిమ్మెలు కూలగొట్టిన వాళ్ల సంగతి తేలుస్తాం

తెలంగాణ సిఎం కేసిఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు టిడిపి నేత రేవంత్ రెడ్డి. కేసిఆర్ ను తెలంగాణ డేరా బాబాగా అభివర్ణించారు.  

దేశంలో అరాచకవాది డేరా బాబా లాంటోడు ఎపిలో జగన్ అయితే తెలంగాణలో కేసిఆరే అని విమర్శించారు రేవంత్. కేసిఆర్ కూడా డేరా బాబా లాంటోడే.

కేసిఆర్ తెలంగాణ ప్రజల కోసం పనిచేసినోడు కాదు. కేసిఆర్ డేరా లేపాల్సి న అవసరం ఉందన్నారు. 2019 ఎన్నికల తర్వాత కేసిఆర్ కు కూడా డేరా బాబాకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

కూకట్ పల్లిలో సోమవారం రేవంత్ రెడ్డి పర్యటించారు. కూకట్ పల్లిలో ఎమ్మెల్యే మాచవరం కృష్ణారావు అనుచరులు టిడిపి పార్టీ దిమ్మెలు కూలగొట్టడం పట్ల రేవంత్ సీరియస్ అయ్యారు.

గల్లీల్లో రియల్ ఎస్టేట్ చేసుకునే నిన్ను ఎమ్మెల్యేను చేస్తే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు జెండా దిమ్మెలు కూలగొడతావా అని ప్రశ్నించారు. నువ్వు తినేది అన్నమేనా అని ఘాటుగా ప్రశ్నించారు రేవంత్.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొనసాగుతున్న టీడిపి హవా,15 వ రౌండ్ లో 26,033 ఓట్ల ఆధిక్యం

 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu