మందుబాబులకు గుడ్‌న్యూస్: తెలంగాణలో రాత్రి 10 గంటల వరకు వైన్స్ షాపులు ఓపెన్

Published : Aug 03, 2020, 09:21 PM ISTUpdated : Aug 04, 2020, 09:39 AM IST
మందుబాబులకు గుడ్‌న్యూస్: తెలంగాణలో రాత్రి 10 గంటల వరకు వైన్స్ షాపులు ఓపెన్

సారాంశం

తెలంగాణ మద్యం దుకాణాల పనివేళలపై విధించిన ఆంక్షలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది.  


హైదరాబాద్: తెలంగాణ మద్యం దుకాణాల పనివేళలపై విధించిన ఆంక్షలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతిచ్చింది ప్రభుత్వం.

also reaad:మందుబాబులకు గుడ్‌న్యూస్: నేటి నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు వైన్స్ షాపులు

కరోనా లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఈ ఏడాది మే 6వ తేదీ నుండి తెలంగాణలో మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే మద్యం విక్రయాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉంచేవారు.

అయితే ఈ ఏడాది జూలై 2వ తేదీ నుండి మద్యం దుకాణాలను సమయ వేళలను మార్చారు. రాత్రి  తొమ్మిది గంటలవరకే  వైన్స్ దుకాణాలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. తర్వాత ఇవాళ్టి నుండి మద్యం దుకాణాల సమయాన్ని మరింత పెంచింది.


 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!