హైద్రాబాద్ డెక్కన్ ఆసుపత్రిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కాకుండా ఇష్టారీతిలో ఫీజులు వసూలు చేయడంపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.
హైదరాబాద్: హైద్రాబాద్ డెక్కన్ ఆసుపత్రిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కాకుండా ఇష్టారీతిలో ఫీజులు వసూలు చేయడంపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.
డెక్కన్ ఆసుపత్రిలో కరోనా చికిత్స కోసం చేరిన రోగుల నుండి లక్షలాది రూపాయాలను వసూలు చేయడంపై పలువురు రోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
undefined
ఈ విషయమై కరోనా రోగుల బాధలు మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు ప్రసారమయ్యాయి. అంతేకాదు కరోనా చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరిన రోగులు చనిపోయిన కూడ లక్షలాది రూపాయాలు చెల్లించకపోతే కనీసం డెడ్‌బాడీలు కూడ ఇవ్వని పరిస్థితి నెలకొంది.
also read:హైద్రాబాద్‌లో విషాదం: కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
రాష్ట్రంలోని కరోనా రోగుల చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అత్యధిక ఫీజులు వసూలు చేసింది. ఈ విషయమై అందిన ఫిర్యాదుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డెక్కన్ ఆసుపత్రిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొంది. కరోనా రోగులకు చికిత్స చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.