తెలంగాణలో మరో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. వాతావరణశాఖ..

Published : Apr 22, 2022, 09:35 AM IST
తెలంగాణలో మరో 4 రోజుల పాటు  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. వాతావరణశాఖ..

సారాంశం

రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్ : ఈ సంవత్సరంలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు బుధవారంనాడు నమోదైన తర్వాత, తెలంగాణ, హైదరాబాద్‌లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. టీఎస్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) లెక్కల ప్రకారం గురువారం సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్‌లో అత్యధికంగా బోరబండలో 13 మిల్లీమీటర్ల వర్షం పడగా, రాష్ట్రవ్యాప్తంగా ములుగు మండలం సిద్దిపేటలో 40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్, షేక్‌పేట, టోలీచౌకి, బండ్లగూడలో సాయంత్రం 13, 7.5, 5, 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రానున్న నాలుగు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన గాలివానలు, కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరిక పేర్కొంది. రాబోయే 24 గంటలలో, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. 

ఇక గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 39º సెల్సియస్, 26ºC గా ఉండే అవకాశం ఉంది. గురువారం హైదరాబాద్‌లో 40.2 డిగ్రీల సెల్సియస్‌, ఆదిలాబాద్‌లో అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇదిలా ఉండగా, Hyderabadలో బుధవారం ఈ సంవత్సరంలోనే అత్యంత వేడి ఉన్న రోజుగా నమోదైంది. బుధవారం నాడు పాదరసం గరిష్ట ఉష్ణోగ్రత 41.4 డిగ్రీల సెల్సియస్‌ గా నమోదయ్యింది. రానున్న రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరో నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల్లో ఈరోజు 45 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కూడా రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రాబోయే 24 గంటలపాటు వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది, సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 40.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చు, కనిష్ట ఉష్ణోగ్రత 27.2 ° C తాకడంతోపాటు 36 శాతం సాపేక్ష ఆర్ద్రత ఉంటుంది.

గత దశాబ్దంలో, ఏప్రిల్ 22న 2016లో రామగుండంలో గరిష్టంగా 46.1 ఉష్ణోగ్రత నమోదైంది, ఆ తర్వాత ఆదిలాబాద్ లో 2019లో ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో 45.3 ° C నమోదైంది.  ఏప్రిల్ 14, 2016న హైదరాబాద్‌లో గరిష్టంగా 43.0 ° C ఉష్ణోగ్రత నమోదైంది. 2015లో రామగుండంలో 47.2°C, 2019లో మే 28న అత్యధిక ఉష్ణోగ్రత, నిజామాబాద్‌లో మే 22న 46.6°C. హైదరాబాద్‌లో 44.3°C, 2015లో మే 22న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని డైరెక్టర్‌ నాగరత్న IMD, హైదరాబాద్ తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్