హైద్రాబాద్‌లో భూప్రకంపనలు: భయంతో పరుగులు తీసిన జనం

By narsimha lodeFirst Published Oct 22, 2020, 10:18 AM IST
Highlights

 నగరంలోని పలు చోట్ల గురువారం నాడు ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. హైద్రాబాద్ నగరాన్ని ఇప్పటికే భారీ వర్షాలు ముంచెత్తాయి. తాజాగా భూకంపంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల గురువారం నాడు ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. హైద్రాబాద్ నగరాన్ని ఇప్పటికే భారీ వర్షాలు ముంచెత్తాయి. తాజాగా భూకంపంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, వైదేహీ నగర్ లో గురువారం నాడు తెల్లవారుజాము ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య భూ ప్రకంపనలు చోటు చేసుకొన్నాయి.
ఇవాళ ఉదయం ఒక్క సెకండ్ పాటు భూమి కంపించిందని స్థానికులు చెప్పారు.

also read:మరోసారి బోరబండలో భూప్రకంపనలు: భయాందోళనలో ప్రజలు

భూమి కంపించడంతో స్థానికులు భయంతో ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు.  నగరంలో పలు చోట్ల భూకంపం వచ్చే అవకాశం ఉందని ఇటీవలనే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త ప్రకటించిన విషయం తెలిసిందే.

భారీ వర్షాల కారణంగా కూడ  భూకంపం వచ్చే అవకాశం లేకపోలేదని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త ప్రకటించారు.నగరంలోని బోరబండ ప్రాంతంలో ఈ నెల  మొదటివారంలో పలు  దఫాలు భూకంపం చోటు చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ భూకంపంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు.  

click me!