మునుగోడు బైపోల్ 2022:పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నందన్న వికాస్ రాజు

By narsimha lodeFirst Published Nov 3, 2022, 10:05 AM IST
Highlights

మునుగోడులో  ప్రశాంతంగా పోలింగ్ సాగుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజు చెప్పారు .రెండు  చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో వాటి  స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు.
 


హైదరాబాద్:మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి  గురువారంనాడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని తెలంగాణ  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజు చెప్పారు.

మునుగోడులో పోలింగ్ సరళిని తన కార్యాలయం నుండి ఆయన పరిశశీలించారు. ఈ సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడారు.నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని  ఆయన చెప్పారు.నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికేతరులున్నారనే విషయమై అందిన పిర్యాదుల  మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టుగా ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాల్లో  పోలింగ్ సరళిని వెబ్ క్యాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని రెండు పోలింగ్ బూత్ ల్లో ఈవీఎంలు  పనిచేయలేదని సమాచారం రావడంతో వాటి స్థానంలో కొత్త ఈవీఎంలను మార్చామని వికాస్ రాజు చెప్పారు.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోఇవాళ ఉదయం మందకొడిగా పోలింగ్  ప్రారంభమైంది .ఆ తర్వాత పోలింగ్ కేంద్రాల వద్య ఓటర్లు బారులు తీరారు.

నియోజకవర్గంలోని 2,41,855 మంది ఓటర్లను తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని  వికాస్ రాజు చెప్పారు పోలింగ్  కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఆయన వివరించారు. ఇవాళ ఉదయం 9 గంటల వరకు 11.20 శాతం పోలింగ్ నమోదైందని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు చెప్పారు.

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. ఈ  నియోజకవర్గంలో 2,41855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు  అధికారులు ఏర్పాట్లు చేశారు. 

also read:మునుగోడు బైపోల్ 2022: చండూరులో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ

మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది. నియోజకవర్గంలోని 241,855 మంది ఓటర్లలో  సగం మంది మహిళలున్నారు. అదే విధంగా కొత్తగా నమోదైన ఓటర్లలో యువత ఎక్కువగా ఉన్నారు.

click me!