మునుగోడు బైపోల్ 2022: ఇడికుడలో ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి

By narsimha lode  |  First Published Nov 3, 2022, 9:14 AM IST

తన  స్వగ్రామం ఇడికుడలో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి తన  ఓటుహక్కును వినియోగించుకున్నారు. 


చండూరు: మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ  చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి తన  స్వగ్రామం ఇడికుడల  గురువారంనాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.టీఆర్ఎస్ అభ్యర్ధి   కూసుకుంట్ల   ప్రభాకర్  రెడ్డి తన స్వగ్రామం  లింగంవారిగూడెంలో తన భార్యతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు.మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇవాళ ఉదయం పోలింగ్  జరుగుతుంది. 

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. ఈ  నియోజకవర్గంలో 2,41855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు  అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.
 

Latest Videos

click me!