అమరావతికి కమ్మరావతి అని పేరు పెట్టండి: జగన్ కు రేణుకా చౌదరి సవాల్

By narsimha lodeFirst Published Apr 15, 2022, 3:37 PM IST
Highlights

అమరావతికి కమ్మరావతి అని పేరు పెట్టాలని ఏపీ సీఎం జగన్ కు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సవాల్ విసిరారు. కమ్మ సామాజిక వర్గాన్ని జగన్ అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు.

నిజామాబాద్: సత్తా ఉంటే అమరావతికి కమ్మరావతి అని పేరు పెట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మాజీ కేంద్ర మంత్రి Renuka Chowdhury సవాల్ విసిరారు.Nizambad జిల్లా వర్నిలో శుక్రవారం నాడు నిర్వహించిన Kamma  సామాజిక వర్గం ఆత్మీయ సమావేశంలో ఆమె ప్రసంగించారు.

 అమరావతి విషయంలో  ఏపీ సీఎం జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని తప్పు పట్టేలా మాట్లాడుతున్నారన్నారు. అంతేకాదు కమ్మ సామాజిక వర్గాన్ని హేళనగా కూడా సీఎం జగన్ మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. మమ్మల్ని తక్కువగా అంచనా వేయకండి అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు.కమ్మ సామాజికవర్గం మంచితనాన్ని బలహీనతగా చూడొద్దని  సీఎం జగన్ కు రేణుక చురకలు అంటించారు. రాష్ట్రం నిలబడాలంటే అన్ని కులాలు అవసరమేనన్నారు.

Latest Videos

2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి శంకుస్థాపన చేశరు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చారు. అమరావతి శాసన రాజధానిగా, కర్నూల్ న్యాయ రాజధానిగా, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటించారు. 

అయితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని   అమరావతి రైతులు ఆందోళన చేశారు. ఏపీ హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి.మూడు రాజధానులపై ఈ ఏడాది మార్చి 3వ తేదీన ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.  మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని ఆదేశించింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని కోర్టు తెలిపింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది.

రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేసేలా, భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేలా చూడాలని  హైకోర్టు కోరింది.. సీఆర్‌డీఏ చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశించాలని, రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని దనలు వినిపించారు. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని.. ఇక ఈ పిటిషన్లపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. 
 

click me!