మంత్రి మల్లారెడ్డి నామినేషన్ లో తప్పులు ఉన్నాయని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనకు ఊరట లభించనట్లయ్యింది.
మంత్రి మల్లారెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయన ఎన్నికల అఫిడవిట్ ను సవాల్ చేస్తూ, నామినేషన్ తిరస్కరించాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. మల్లారెడ్డి తన ఎన్నికల కోసం దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తప్పులు ఉన్నాయని పిటిషనర్ అంజిరెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని తాను ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కు తెలియజేసినా.. చర్యలు తీసుకోలేదని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.
Chandrayaan-4:చంద్రుడిపై మరో ప్రయోగం.. చంద్రయాన్-4కు సిద్ధమవుతున్న ఇస్రో
కాబట్టి మల్లారెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలే ఎలక్షన్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ అంజిరెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. దీనికి కౌంటర్ గా ఎలక్షన్ కమిషన్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. అంజిరెడ్డికి ఈ విషయంలో ఎలక్షన్ రిట్నరింగ్ ఆఫీసర్ ఇప్పటికే సమాధానం ఇచ్చారని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషన్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.