వారికి జీవితాంతం ఉచితంగా మందులు

First Published Jan 29, 2017, 10:13 AM IST
Highlights

త్వరలో రాష్ట్రంలో 40 కిడ్నీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి

డయాలసిస్ రోగులకు శుభవార్త. రాష్ట్రం వ్యాప్తంగా త్వరలో 40 కిడ్నీ సెంటర్ల ను ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తెలిపారు. అలాగే డయాలసిస్ రోగులకు ఉచితంగా జీవిత కాలం మందులు సరఫరా చేస్తామన్నారు.

 

ఒక్క సర్కార్ మాత్రమే అన్ని చేయలేదని, అగర్వాల్ సమాజ్ తరహాలో దాతలు, వ్యాపారులు సర్కార్ కి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. గాంధీ లో అగర్వాల్ సమాజ్ సహాయ ట్రస్ట్ సహకారంతో కిడ్నీ సెంటర్ ని, మంచినీటి ప్లాంట్ ని మంత్రి ఈ రోజు ప్రారంభించారు.

 

అనంతరం ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 8 వేల మందికి రెగ్యులర్ డయాలసిస్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ సెక్టార్ లో ఇప్పటి వరకు 7 డియాలిసిస్ కేంద్రాలు ఉన్నాయన్నారు. వాటిని 40కి పెంచుతున్నామని వెల్లడించారు.

click me!