కడెం ప్రాజెక్టు వద్ద రెడ్ అలెర్ట్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్

By narsimha lode  |  First Published Jul 13, 2022, 2:01 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. వరద పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో తెలంగాణ సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. కడెం ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో తో వివరాలను తీసుకున్నజాగ్రత్తలను సీఎం కేసీఆర్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. 


ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని Kadam Project  ప్రాజెక్టు వద్ద పరిస్ధితిపై తెలంగాణ సీఎం KCR  ఆరా తీశారు. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. కడెం ప్రాజెక్టుకు ఎగువ నుండి 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుంది. అయితే కడెం ప్రాజెక్టుకు చెందిన 17 గేట్ల ద్వారా సమారు రెండున్నర లక్షలకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు మరో గేటు మాత్రం తెరుచుకోలేదు. దీంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 

కడెం ప్రాజెక్టు దిగువన ఉన్న 25 గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మంగళవారం  రాత్రి నుండి సైరన్ మోగించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ప్రజలను కోరారు.ఈ ప్రాజెక్టు పరిస్థితిపై  దేవాదాయ శాఖ మంత్రి Indrakaran Reddy కి సీఎం phone  చేసి అడిగి తెలుసుకున్నారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. కడెం ప్రాజెక్టు వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ప్లో తో పాటు ముంపు గ్రామాల ప్రజల పరిస్థితిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీఎం కేసీఆర్ కు వివరించారు. ఇరిగేషన్ అధికారులతో కూడా సీఎం ఈ విషయమై మాట్లాడారు.  వరదను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొన్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీఎం కేసీఆర్ కు వివరించారు.

Latest Videos

undefined

also read:కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద: సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన

కడెం ప్రాజెక్టు వద్ద పరిస్థితిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా తెలుసుకున్నారు. కడెం ప్రాజెక్టుకు దిగువన ఉన్న 25 గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. 

click me!