తెలంగాణ బడ్జెట్ ‘ఓట్ ఆన్ అకౌంట్’ గా ఉండడానికి కారణమిదే...

By SumaBala Bukka  |  First Published Feb 10, 2024, 1:40 PM IST

తెలంగాణాలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతోందని. తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే ఈ బడ్జెట్ లక్ష్యం అన్నారు.


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శనివారం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. అయితే ఇది ఓట్ ఆన్ అకౌంట్ గా ప్రవేశపెట్టారు. దీంతో పూర్తి స్థాయి ప్రభుత్వం ఇలా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గా ప్రవేశపెట్టడంపై చర్చ జరుగుతుంది. దీనికి బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ గా పెట్టడం మాకు కొంత అయిష్టంగానే ఉంది’ అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2024న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. మొదటి నుంచి మా ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూర్చుకోవాలనే విషయం మీద స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు.

దీంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేసే నిధులను సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని స్పష్టత ఉందని, ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్లో వివిధ రంగాల వారీగా కేటాయింపులు జరిపినప్పుడే మన రాష్ట్రానికి ఎంత మేరకు ఆ నిధులలో వాటా వస్తుందని అంచనా వేయగలుగుతాం.. అన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాతే రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించినట్టుగా తెలిపారు.

Latest Videos

తెలంగాణ బడ్జెట్: రూ. 2 లక్షల పంట రుణమాఫీ, రైతు భరోసాపై కీలక ప్రకటన

తెలంగాణాలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతోందని. తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే ఈ బడ్జెట్ లక్ష్యం అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించిన విధంగా 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని బడుగు, బలహీనులను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు..

నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అత్యంత ప్రధానమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన పెంచడం సమగ్ర అభివృద్ధి సాధిస్తాం అన్నారు. గత పాలకులు ప్రభుత్వ ఖజానాను దివాలా తీయించారన్నారు. ప్రణాళిక లేకుండా హేతుబద్ధత లేకుండా వారు చేసిన అప్పులు ఇప్పుడు పెద్ద సవాలుగా మారాయన్నారు. అయితే ప్రణాళిక బద్ధమైన ఆలోచనలతో సాహేతుకమైన కార్యాచరణతో ఈ సవాలను అధిగమిస్తామని చెప్పుకొచ్చారు. 

తమ ప్రభుత్వం దుబారాని ఘననీయంగా తగ్గిస్తుందని.. కాలేశ్వరం ప్రాజెక్టు లాంటి నిరర్థక ఆస్తులు పెంచుకుంటూ వాటిని తెలంగాణ ప్రజలకు భారంగా చేయడం తమ విధానం కాదని, కేవలం తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందడం, వారు సంతోషంగా ఉండడం... మాత్రమే తమ లక్ష్యాల అన్నారు. దీనికి అనుగుణంగానే తమ ప్రభుత్వ విధానాలు ఉంటాయని ఈ బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా మరొకసారి స్పష్టం చేస్తున్నానని భట్టి తెలిపారు. 

ఓట్ ఆన్ అకౌంటు బడ్జెట్ అంచనాలు ఈ విధంగా ఉన్నాయి..

2024 25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ అకౌంటు మొత్తం వ్యయం రూ. 2, 75, 891 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లు
మూలధన రూ. వ్యయం 29,669 కోట్లు గా తెలిపారు. దీని తరువాత సభ సోమవారానికి వాయిదా పడింది. 

click me!