హైదరాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు.
హైదరాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. మృతుడిని ముసాగా గుర్తించారు. దుండగుడు ఫహీద్ అతనికి కిరాతకంగా హతమార్చాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగిన లావాదేవీలతోనే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.