రంగారెడ్డి జిల్లాలో రియల్ ఏస్టేట్ వ్యాపారి సత్తయ్య హత్య

By narsimha lodeFirst Published Jun 19, 2020, 1:27 PM IST
Highlights

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్ అటవీ ప్రాంతంలో రియల్ ఏస్టేట్ వ్యాపారి సత్తయ్య హత్యకు గురయ్యారు.ఓ భూమి విషయంలో రియల్ఏస్టేట్ వ్యాపారుల మధ్య విభేదాల కారణంగా  ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.


హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్ అటవీ ప్రాంతంలో రియల్ ఏస్టేట్ వ్యాపారి సత్తయ్య హత్యకు గురయ్యారు.ఓ భూమి విషయంలో రియల్ఏస్టేట్ వ్యాపారుల మధ్య విభేదాల కారణంగా  ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

చౌదరిపల్లికి చెందిన సత్తయ్యగా పోలీసులు గుర్తించారు. భూమి రిజిస్ట్రేషన్ విషయంలో తమ వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చినట్టుగా గుర్తించారు.
ఈ విషయమై ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

గున్‌గల్ అటవీ ప్రాంతంలో సత్తయ్య మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. భాగస్వామ్యుల మధ్య కొంత కాలంగా విభేదాలు ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. 

ఏ భూమి విషయంలో భాగస్వామ్యుల మధ్య గొడవలు  చోటు చేసుకొన్నాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూములకు చాలా విలువ ఉంది. ఎయిర్ పోర్టుతో పాటు పలు ఐటీ కంపెనీలు , ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే.

click me!