భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలో గల ఎస్‌వీఆర్ కెమికల్ ఫ్యాక్టరీలో ఇవాళ రియాక్టర్ పేలింది. దీంతో మంటలు చెలరేగాయి.
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడంలో గల ఎస్‌వీఆర్ ఫ్యాక్టరీలో ఆదివారం నాడు రియాక్టర్ పేలింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ పేలుడుతో కార్మికులు భయంతో పరుగులు తీశారు.సాల్వెంట్ రీసైక్లింగ్ చేస్తున్న సమయంలో రియాక్టర్ పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నాయి.ప్రమాదాలు జరిగిన సమయంలోనే అధికారులు హడావుడి చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం స్టీల్ ఫ్యాక్టరీలో ఈ నెల 11వ తేదీన పేలుడు జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు.
undefined
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ని జీఎఫ్ఎంఎస్ ఫార్మాలో ఈ ఏడాది జనవరి 31న పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇకరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. 2022 డిసెంబర్ 11న విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ లో ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో గల ఫార్మా కంపెనీలో గత ఏడాది నవంబర్ 15న జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియుద్దలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు చోటు చేసుకుంది.ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ ఘటన గత ఏడాది నవంబర్ 10న జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో గల అపెక్స్ ఫ్యాక్టరీలో గత ఏడాది నవంబర్ 5న జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు.