కాంగ్రెస్, కామ్రేడ్ల మధ్య పొత్తు ఖరారు.. ఆ నాలుగు సీట్లు లెఫ్ట్ పార్టీలకు..!

By Mahesh K  |  First Published Oct 20, 2023, 8:31 PM IST

కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు ఖరారైనట్టు తెలిసింది. వైరా, మిర్యాలగూడ సీపీఎంకు, కొత్తగూడెం, చెన్నూరు సీపీఐకి కాంగ్రెస్ కేటాయించినట్టు సమాచారం. 
 


హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, కామ్రేడ్ల మధ్య పొత్తు కుదిరింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లను లెఫ్ట్ పార్టీలకు కేటాయించింది. సీపీఐ, సీపీఎం చెరో రెండు సీట్లను కేటాయించింది. సీపీఎంకు వైరా, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాలు, సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లను ఖరారు చేసినట్టు తెలిసింది. కాగా, మునుగోడు, హుస్నాబాద్ స్థానాలను లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్ నిరాకరించినట్టు సమాచారం.

కేటాయించిన ఈ నాలుగు సీట్లలో లెఫ్ట్ పార్టీలు ఏ అభ్యర్థులను బరిలోకి దింపనున్నారా? అనే ఆసక్తి నెలకొంది. కమ్యూనిస్టు పార్టీలకు సీట్లు కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో కాంగ్రెస్ ఇక రెండో జాబితాను విడుదల చేయడానికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే మిగిలిన సీట్లలో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించనుంది.

Latest Videos

Also Read : సీట్ల సర్ధుబాటు పై చర్చలు: కాంగ్రెస్ తీరు పై లెఫ్ట్ పార్టీల అసంతృప్తి

ఇదిలా ఉండగా, వామపక్షాలతో పొత్తు నష్టమేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అభిప్రాయపడ్డారు.ఆదివారం నాడు  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. టిక్కెట్లు రాని వారికి  పదవులు వస్తాయన్నారు. టిక్కెట్లు రాలేదని నిరాశ చెందవద్దని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారడం  బాధాకరమన్నారు.టిక్కెట్లు అమ్ముకున్నారని  ఆరోపణలు చేయడం సరైంది కాదని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.రేవంత్ రెడ్డి ని తిడితే అధిష్టానాన్ని తిట్టినట్టేనని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో  బీఆర్ఎస్ ముక్కలు కావడం ఖాయమని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.

click me!