
ఖమ్మం: వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకొంది. ఖమ్మం జిల్లాలోని ముచ్చర్లకు చెందిన వి.రవీందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
వీరిద్దరి మధ్య కొన్ని మాసాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే నాలుగు రోజుల క్రితం వీరిద్దరి మధ్య ఏ కారణంగానో విబేధాలు చోటు చేసుకొన్నాయి. దీంతో రవీందర్ రెడ్డి మనస్థాపానికి గురయ్యాడు.
రవీందర్ రెడ్డి ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు రవీందర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవీందర్ రెడ్డి మృతి చెందాడు.
అయితే తమ కొడుకు మృతికి ఆ మహిళే కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు మహిళపై దాడికి దిగారు. ఈ ఘటనపై రవీందర్ రెడ్డి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.