ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఉద్యోగి

Published : Jul 21, 2018, 03:30 PM IST
ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఉద్యోగి

సారాంశం

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన జీహెచ్ఎంసీ ఉద్యోగి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్( జీహెచ్ఎంసీ) ఉద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీకి  అడ్డంగా దొరికిపోయాడు. సికింద్రాబాద్ జోన్ కార్యాలయంలో ఏఎంవోహెచ్‌గా పని చేస్తున్న వెంకట రమణ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. క్యాటరింగ్ సర్వీస్ యజమాని వద్ద వెంకట రమణ రూ. 60 వేలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వెంకట రమణ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bathukamma Celebrations : గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు.. ప్లాన్ ఇదే..: కల్వకుంట్ల కవిత
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల నమోదు ఎలా చేసుకోవాలి? అర్హతలు ఏంటి?